Karthika deepam: దీప మీద అరిచిన కార్తీక్... ఆనంద్ కోసం మోనిత ప్రయత్నాలు!

First Published Sep 15, 2022, 7:44 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... కార్తీక్, దీప ఇంటికి వచ్చి కోపంగా అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్ వంటలక్క? నన్ను మోనిత నుంచి దూరం చేద్దామని ఉద్దేశం ఎందుకు నీకు వస్తుంది? అయినా తలనొప్పికి, జ్వరానికి వంట  మానిపించడం ఏంటి? ఆ డాక్టర్ మీ అన్నయ్య కదా అయినా అతని డాక్టర్ ఏనా అని అంటాడు.అప్పుడు దీప కావాలంట ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్తాను డాక్టర్ బాబు అని అంటుంది. దానికి కార్తీక్,నాకు కారణాలు వద్దు, అప్పుడెప్పుడో నా దగ్గరికి నా భార్య అంటూ వచ్చావు.
 

ఇప్పుడేమో మోనిత నీ నా నుంచి  విడగొట్టడానికి చూస్తున్నావు. అప్పుడు టిఫిన్ లో ఏదో కలిపావు అనుకున్నాము, దేవుడి మీద ఒట్టేసేసరికి నీ పని కాదేమో అని నిన్ను వెనకేసుకొని వచ్చాను కానీ, పరిస్థితులు చూస్తూ ఉంటే అది కూడా నువ్వే చేసినట్టు ఉన్నావు,నీకు ఒక విషయం చెప్తున్నాను గుర్తుంచుకో నా జీవితం అంతా మోనితకి మాత్రమే. ఇంకే ఆడదానికి కాదు అని అంటాడు.దీప ఏడ్చుకుంటూ, మీకు గతం గుర్తొస్తే ఇలా మాట్లాడారు డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఏ నాకు గతం గుర్తొస్తే నువ్వే నా భార్యవి అని చెప్తావా ఇంకా ఇవన్నీ ఆపు వంటలక్క అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.
 

 ఆ తర్వాత సీన్లో మోనిత,ఇప్పుడు ఆనంద్ నీ  తెస్తే కార్తీక్ కి నామీద ప్రేమ పెరుగుతుంది కానీ ఎలా తేవాలి? నేను అక్కడికి వెళ్తే ఈ సమయంలో దీప కార్తిక్ ని తన వసపరుచుకుంటుంది.కార్తీక్ ని తీసుకెళ్తే అక్కడ అందరూ గుర్తు పట్టేస్తారు. నేను వెళ్లే రెండు రోజులు దీప నీ ఇక్కడి నుంచి మాయం చేయాలి. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అమ్మ అన్నయ్యతో పాటు కూర్చుని,నేను చెప్పాను కదా అన్నయ్య డాక్టర్ బాబు ని నా మీదకి వసుగలుకుతుంది అని అదే జరిగింది అని అనగా వాళ్ళ అన్నయ్య, ఆ మోనిత చాలా కంచు లాగా ఉన్నదమ్మా.
 

 ఆ తర్వాత సీన్లో మోనిత,ఇప్పుడు ఆనంద్ నీ  తెస్తే కార్తీక్ కి నామీద ప్రేమ పెరుగుతుంది కానీ ఎలా తేవాలి? నేను అక్కడికి వెళ్తే ఈ సమయంలో దీప కార్తిక్ ని తన వసపరుచుకుంటుంది.కార్తీక్ ని తీసుకెళ్తే అక్కడ అందరూ గుర్తు పట్టేస్తారు. నేను వెళ్లే రెండు రోజులు దీప నీ ఇక్కడి నుంచి మాయం చేయాలి. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అమ్మ అన్నయ్యతో పాటు కూర్చుని,నేను చెప్పాను కదా అన్నయ్య డాక్టర్ బాబు ని నా మీదకి వసుగలుకుతుంది అని అదే జరిగింది అని అనగా వాళ్ళ అన్నయ్య, ఆ మోనిత చాలా కంచు లాగా ఉన్నదమ్మా.
 

 నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తన బిడ్డను తీసుకువచ్చి కార్తీక్ ని పూర్తిగా మార్చేయొచ్చు నువ్వు ఉన్నప్పుడే,కార్తీక్ కి గతం గుర్తున్నప్పుడే బిడ్డ నీ కనింది  అంటే ఇది తనకి మంచి అవకాశం ఏ కదా జాగ్రత్త అని చెప్పి, డాక్టర్ బాబుకి నువ్వే వైద్యం చేయాలి డాక్టర్ బాబు మనసులో మళ్ళీ మంచి స్థానం తప్పించుకోవాలి అని అంటాడు.ఆ తర్వాత సీన్లో హి, వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్లి తాతయ్య ఆనంద్ నీ తెచ్చుకున్నాం తాతయ్య అని  అంటుంది. అప్పుడు ఆనందరావు మనసులో, తెచ్చుకుంటే ఆ బాబు ఎవరూ అని ఊర్లో వాళ్ళందరూ అడుగుతారు, మోనితకి కార్తీక్ కి పుట్టాడు అని తెలిస్తే పరువంతా పోతుంది అని మనసులో అనుకుంటాడు.
 

 ఆ తర్వాత సీన్లో వారణాసి సౌర్యకి తెలియకుండా ఆటోలో వెళ్దాం అనుకుంటాడు. ఇందులో శౌర్య చూసి, నన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నారు అని అనగా నీకు ఒంట్లో బాలేదు కదా,అయిన ప్రతి రోజు  ఆటోలో రావడం ఏం బాలేదు అని అనగా, నేను మా అమ్మ నాన్న లను ఎలాగైనా వెతకాలి. ఒకవేళ అమ్మానాన్నలు తిరిగి వస్తే మనం మళ్లీ మా ఇంటికి వెళ్లిపోవచ్చు అక్కడ మనకి ఏ కష్టాలు రావు అని అనగా సౌర్య వాళ్ళ పిన్ని పోనీ వెళ్ళమ్మా వెతుకు మనం ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని సౌర్య ని వారణాసితో పంపిస్తుంది. అప్పుడు సౌర్య వాళ్ళ బాబాయ్ పిన్ని లు, సౌర్యమ్మకి వాళ్ళ అమ్మ నాన్నల మీద ఆశ చావడం లేదు.
 

 ఒకవేళ అది నిజం కాదు అని తెలిస్తే ఏమవుతుందో అని బాధపడతారు. ఆ తర్వాత సీన్లో దీప, వాళ్ళ అమ్మకు అన్నయ్యకు వడ్డిస్తూ అన్నయ్య, డాక్టర్ బాబు గతం గుర్తొచ్చే వైద్యం ఏమైనా ఉంటే బలవంతంగా నైనా తీసుకొద్దామని అంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య బలవంతంగా తీసుకొస్తే కార్తీక్ సహకారం లేకుండా వైద్యానికి ఫలితం ఉండదు డాక్టర్ బాబుని తీసుకురావాలంటే మోనిత ఒప్పుకోదు. ఒకవేళ బలవంతంగా తీసుకువస్తే కార్తీక్ కి నీ మీద చెడు అభిప్రాయం వచ్చి మోనిత చెప్పిందే నిజం అనుకుంటాడు అని అంటాడు. అప్పుడు దీప, పిల్లలు,నేను, ఆయన ఒకటి కలవాలి అని తొందరపడి అన్నాను.
 

మీరు చెప్పిందే నిజం అప్పటివరకు వేచి చూడడమే అని అంటుంది.ఆ తర్వాత సీన్లో ఎవరో మోనిత దగ్గరికి వచ్చి మీ భర్తగతం మర్చిపోయారు కదా అమ్మ ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో మాకు ఒక ప్రకృతి వైద్యశాలు ఉన్నది. అక్కడ ఏ మనిషికైనా వారంలో గతం గుద్దు తెప్పిస్తాము డబ్బులు కూడా అవసరం లేదు అని అనగా మోనిత,ఏం అవసరం లేదు మీరు వెళ్ళండి అని అంటుంది.అప్పుడు దీప మనసులో, నాకు తెలిసే నువ్వు అక్కడికి తీసుకువెళ్ళు అని.తీసుకువెళ్తే నీ బండారం బయట పడిపోతుంది కదా అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో  ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!