Karthika Deepam: వారణాసికి యాక్సిడెంట్.. గతం గుర్తుతెచ్చుకున్న కార్తీక్.. దీపను లేపేసేకి మోనిత పక్కా ప్లాన్!

First Published Oct 13, 2022, 7:35 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 13వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..చంద్రమ్మ అక్కడికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని శౌర్య, వాళ్ళ బాబాయి అడగగా, మీ అమ్మ కోసం వెతకడానికి వెళ్లాను ఎక్కడ దొరకలేదు అని చెప్తుంది. అప్పుడు ఇంద్రుడు, నాకు దొరికారు అని అనగా, మరి కలిసారా?తను మీ అమ్మేనా? అని అడగగా కాదు మా అమ్మ కాదు అని శౌర్య చెప్తుంది. ఇప్పుడు మనకి ఇంకేం అసలు లేవు అని చంద్రమ్మ అనగా, లేదు పిన్ని అమ్మ నాన్నలు బతికే ఉన్నారని నాకు నిజం తెలిసింది అని శౌర్య అంటుంది.అమ్మానాన్నలు బతికే ఉండడం ఏంటమ్మా అని చంద్రమ్మ అడుగుతుంది.
 

 దానికి శౌర్య,మోనిత విషయంలో జరిగినదంతా చెప్తుంది. ఆవిడ ఎంత చేస్తుందని నేను అనుకోలేదు అని చంద్రమ్మ అంటుంది. దానికి శౌర్య, నేను మోనిత ఆంటీ దగ్గరికి వెళ్ళాలి ఇందాక తీర్చడానికి లెక్క తీర్చే తిరిగి వెళ్దాము. ఇంటికి వెళ్లిన తర్వాత ఇంకో కొత్త లెక్క మొదలు పెట్టాలి.ఎప్పుడైతే అమ్మ నాన్నలు చనిపోయారు అని అబద్ధం చెప్పిందో అప్పుడే నాకు శత్రువు అయిపోయింది. నేను అక్కడికి వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మోనిత దగ్గరికి వెళ్తుంది శౌర్య. ఆ తర్వాత సీన్లో వారణాసి, కార్తీక్ గతం మర్చిపోయాడు అని తెలిసి గత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ, మీరు గతం మర్చిపోవడం ఏంటి డాక్టర్ బాబు అని అంటాడు.
 

కార్తిక్ కి అస్పష్టమైన గతం గుర్తొస్తుంది.అప్పుడు బాధపడుతూ, నువ్వు చెప్పినవన్నీ చూస్తే దీపే నా భార్య అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా దీపే నా భార్య అయితే నేను చేయకూడని తప్పు చేశాను అని అంటా.డు దానికి వారణాసి దీపక్క బతికే ఉందా? ఎక్కడ ఉంది? అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, నా చుట్టూనే ఉన్నది నేనే తన భర్తని అని చెప్తూనే ఉన్నది నేనే ఎప్పుడు వినలేదు పాపం అని అనగా, ఇంత పని చేశారేంటి డాక్టర్ బాబు పదేళ్ల నుంచి చేయని తప్పుకు నింద మోస్తుంది అక్క.ఇప్పుడు మళ్ళీ అక్క ని అవమానించారు పాపం  ఎన్ని కష్టాలు పడుతుందో అని అంటాడు.
 

 దానికి కార్తీక్, చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను ఒక్కడినే వదిలే నాకేం మాట్లాడాలో తెలియడం లేదు వెళ్లిపో అని అరుస్తాడు. దానికి వారణాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు దీప సందు చివరికి వచ్చి కార్తీక్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా కార్తీక్ కనిపించకపోయేసరికి ఇంకా లోపలికి వెళ్లి వెతుకుతుంది. అదే సమయంలో వెనకాతల నుంచి రౌడీలు దీప వెనకాతల నుంచి చంపేద్దామని చూస్తారు. అప్పుడే వారణాసి అక్కడికి వస్తాడు. దీపన చూసిన వారణాసి దీపక్క అని అరిచేలోగా పక్కన ఉన్న రౌడీలను చూసి వారి మీద దాడి చేస్తారు.
 

వాళ్ళు ముగ్గురు వారణాసిని తిరిగి కొడుతున్నప్పుడు కార్తీక్ అక్కడికి వచ్చి వారణాసికి సహాయం చేసి రౌడీలను అక్కడ నుంచి తరిమి కొడతారు  కానీ వారణాసి మాత్రం స్పృహ కోల్పోయి దెబ్బలతో కింద పడుంటాడు. మరోవైపు శౌర్య మోనితను వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడ మోనితను చూసిన శౌర్య రాయితో మోనితను కొట్టాలని చూస్తుంది దూరం నుంచి మోనితవైపు రాయి విసురుతుంది.సరిగ్గా అదే సమయంలో ఆ రాయి మోనితకు తగలకుండా వీధి చివర ఉన్న కార్తీక్ కి తగులుతుంది. మోనిత సౌర్యను చూస్తుంది. శౌర్య మోనితకు తగల్లేదు అని అక్కడ నుంచి పారిపోతుంది.కార్తిక్ కి రాయి తగిలిన వెంటనే కార్తీక్ కి అస్పష్టమైన గతం గుర్తొస్తూ అలాగా దీప ముఖం, సౌర్య ముఖం, హిమ ముఖం అన్ని గుర్తొచ్చి ఆక్సిడెంట్ గురించి,గతం అంతా గుర్తొస్తుంది.అప్పుడు దీప అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో స్పృహ తప్పిన వారణాసిని లేపడానికి ప్రయత్నిస్తాడు. 

మరోవైపు శౌర్య అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరికి వస్తుంది. ఏమైందమ్మా అని అనగా మోనిత ఆంటీని రాయి పెట్టుకొని కొట్టారు కానీ అది తగలలేదు. ఆంటీ నన్ను చూశారు అందుకే పరిగెట్టుకొని వచ్చాను అని అనగా, చూసి రమ్మంటే కాల్చి వచ్చావా అమ్మ.ఎలాగో ఇక్కడ జాతర అయిపోయింది కదా వెళ్ళిపోదాము అని ఇంద్రుడు అంటాడు. అప్పుడు ముగ్గురు ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. మరోవైపు మోనిత,కావేరి కూర్చొని ఉంటారు. అప్పుడు మోనిత కంగారుపడుతూ, మంచి అవకాశం పోయింది కావేరి. పదేళ్లుగా నేను ఏ అవకాశాలు లేక ఎదురు చూస్తూనే ఉన్నాను కార్తీక్ కోసం. బంగారు లాంటి అవకాశం దొరికింది అనుకుంటే ఇప్పుడే ఆ వంటలక్క వచ్చి మధ్యలో పెంట పెట్టింది అని అంటుంది. దానికి కావేరి, అయినా మీరు ఇక్కడున్నట్టు తనకి ఎలా తెలుసు అని అడగగా, ఏమో కావేరి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది.

ఇప్పుడు దానికి తోడుగా వెనకాతలు ఇద్దరు మొదలయ్యారు ఆ దుర్గ గాడు ఒకడు, ఈ శౌర్య ఒక్కద్ది. పోనీ వీళ్ళందర్నీ ఎలాగైనా ఎదిరిద్దాం అనుకుంటే ముందు కార్తీక్ ఇక్కడ లేడు. మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియడం లేదు అని అంటుంది.మరోవైపు దీప కార్తీక్ కోసం జాతర అంతా వెతికి తిరిగి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తుంది. అన్నయ్య, డాక్టర్ బాబు కనిపించడం లేదు. మోనిత చాలా ధీమాగా ఉన్నది ఆ సందు చివర ఉన్నారని చెప్పింది తీరా అక్కడికి వెళ్తే డాక్టర్ బాబు కనిపించలేదు. తిరిగి వచ్చి చూసేసరికి మోనిత కూడా లేదు నన్ను పక్కదారి మళ్ళించి వాళ్ళు వెళ్లిపోయినట్టున్నారు. 
 

మళ్ళీ తిరిగి రారేమో అని బాధపడుతూ ఉంటుంది. దానికి దీప వాళ్ళ అన్నయ్య,ఇప్పుడే ఏదో ఊహించుకోని బాధపడొద్దు ఎక్కడికి వెళ్ళు ఉండరు అని అంటాడు. మరోవైపు కార్తీక్, వారణాసి ని హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. వారణాసిని డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కార్తీక్ కి తల పైన కట్టు కట్టి మీకు ఏ ప్రాబ్లం లేదండి బానే ఉన్నది అని అంటాడ. పక్కనున్న నర్స్ కార్తీక్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ ఉండగా తను కూడా డాక్టరు అని వాళ్లకు తెలుస్తుంది. మీరు డాక్టర్ ఆ?అని కార్తీక్ ని అడగంగా, అవును హైదరాబాదులో కార్డియాలజిస్ట్ అని కార్తీక్ అంటాడు. కార్తీక్ డాక్టర్ని వారణాసి స్థితి ఎలా ఉన్నది అని అడగగా, అతను మాత్రం కోమలోకి వెళ్లే అవకాశం ఉన్నది నుదుటికి పెద్ద దెబ్బ తగిలింది అని డాక్టర్లు అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!