Karthika Deepam: నిన్ను కొట్టి మరీ నా మొగుడుని తీసుకెళ్తా.. మోనితకి దీప షాకింగ్ వార్నింగ్!

First Published Sep 10, 2022, 8:43 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 10వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప వాళ్ళ అన్నయ్య, కార్తీక్ కి గతం లో ఏ సంఘటన గుర్తిస్తాదో తెలియదు.ఒకవేళ మొనిత భార్య అని మాత్రమే గుర్తుంటే నిన్ను ఇంక పట్టించుకోడు. కనుక గతమంతా గుర్తొచ్చిన తర్వాతే తనని ఇంటికి తీసుకెళ్లడం మంచిది లేకపోతే తన దృష్టిలో నువ్వు చెడ్డ దానివి అవుతావు అని అంటాడు. అప్పుడు దీప, నేను అదే అనుకుంటున్నాను అన్నయ్య. ఎలాగైనా డాక్టర్ బాబు మనసులో, మోనిత చెడుగా మిగిలాలి. ఇప్పటికే నాకు సారీ చెప్పించారు అని అంటుంది దీప. అప్పుడు దీప వాళ్ళ అమ్మ ఈ సకునాలన్నీ చూస్తుంటే నీకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి కానీ మొన్న విషం కలిపావని నింద వేసింది అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని దీప కి సలహా ఇస్తుంది.
 

అప్పుడు దీప, మోనిత బుధ్ధి నాకు తెలుసు అమ్మ. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉంటున్నాను రేపు ఇంట్లో వినాయకుడు పూజ చేస్తున్నాను ఆయన్ని పిలిచాను.తప్పకుండా వస్తా అన్నారు నేను ఇంకా బయలుదేరుతాను అని బయలుదేరుతుంది. ఆ తర్వాత సీన్లో శివ మోనిత దగ్గరికి వెళ్లి దీపక్క ఇక్కడే ఇంటికి వచ్చేసింది అని అంటాడు. దానికి మోనిత వాడి చంప మీద కొట్టి దీపక్క ఎవర్రా?నా డబ్బులు తింటూ దాన్ని వరసలు పెట్టి పిలుస్తున్నావు అని తిడుతుంది.
 

ఇంకెప్పుడూ పిలవను అని అంటాడు శివ. అప్పుడు శివ  ఇద్దరూ దీప ఇంటికి వెళ్తారు. అక్కడ మోనితా, అక్క ఈ తోరణాలు ఏంటి పండగ వాతావరణం ఇక్కడే ఉన్నది అని అంటుంది. దానికి దీప,పండగ చేసుకునే సమయం వచ్చింది కదా అని అంటుంది. వాళ్ళిద్దరూ మాటలు విని శివ నోరెళ్ల పెడతాడు. అప్పుడు మోనిత శివని అక్కడి నుంచి పంపించేస్తుంది. కార్తీక్ ని పిలిస్తే, నేను వచ్చానే అనుకుంటున్నావా? కార్తీక్ రేపు ఇక్కడికి వస్తే గతం గుర్తు చేయడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేసినట్టు ఉన్నావు పాపం అలా జరగకూడదు అని మా ఇంటికి పిలుస్తున్నాను. అయినా నేను కార్తీక్ కి భార్యగా, నువ్వు పరాయి దానిలా, బాగుంది దీపా ఇది అని అంటుంది. దానికి దీప ఎంత బాగున్నా డాక్టర్ బాబుకి గుర్తొచ్చే వరకే మోనిత.
 

నిజంగానే డాక్టర్ బాబుని నా దగ్గరికి తీసుకురావాలనుకుంటే, అత్తయ్య మామయ్యలను పిలిపించి మా పెళ్లి ఫోటోలు చూపిస్తే చాలు. డాక్టర్ బాబుకి గతం గుర్తు రాకపోయినా, నీకు నాలుగు తగిలించి వాళ్లు తీసుకెళ్లి పోతారు కానీ నాకు డాక్టర్ బాబు, తనంతట తానే నా దగ్గరికి రావాలి అప్పటివరకు డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. అందుకు మోనిత, రాత్రి కూడా పగటి కలలు కంటున్నావు అలాగే కంటూ ఉండు కానీ పూజకు రావడం మర్చిపోవద్దు అని అంటుంది.దానికి దీప, నువ్వు వచ్చి పిలిచావు కదా నేను వచ్చినా రాకపోయినా ప్రతిఫలం మాత్రం నీకు తిరిగి వస్తుందిలే అని అంటుంది. అప్పుడు మోనిత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

ఆ తర్వాత సీన్లో, సౌర్య వారణాసి తో పాటు బొమ్మలు అమ్ముతూ ఉంటుంది. ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా ఇంటికి వెళ్దామని అంటుంది.ఇంతలో మోనిత, కార్తీక్, శివ కారులో వెళ్తుండగా కార్తీక్ కార్ ఆపి సౌర్య వైపు చూసి ఆ పాపని చూడు ఎక్కడో చూసినట్టుంది అని అంటాడు. శౌర్య ని చూసి ఆశ్చర్యపోయి, ఎక్కడ కార్తీక్ కి గతం గుర్తొస్తుందని భయపడుతుంది మొనిత.ఎక్కడా చూడలేదు కార్తీక్ అని అంటుంది అప్పుడు.కార్తీక్, పాపం కదా. ఇంత రాత్రి పూట పువ్వులు అమ్ముకుంటుంది అని అనగా, కొన్ని రాతలు అంతే కార్తీక్ మనమేం చేయలేము అని అంటుంది మోనిత. అప్పుడు కార్తీక్ ఎందుకు మనం ఏం చేయలేము ఈరోజు అక్కడున్నవన్నీ కొనుక్కొని వచ్చేద్దాం అప్పుడు వాళ్లు త్వరగా ఇంటికి వెళ్తారు కదా మన సాయం మనం చేసినట్టు ఉంటుంది అని అంటాడు.
 

కార్తీక్  కొనడానికి కార్ దిగుతున్నప్పుడు మోనిత, కార్తీక్ ని ఆపి నువ్వెందుకు వెళ్లడం కార్తీక్ శివ ఉన్నాడు కదా అని శివని పంపిస్తుంది. అప్పుడు కార్తీక్ శివతో బేరాలాడకుండా ఎంత అయితే అంత కొనుక్కొని వచ్చే అని అంటాడు. శివ మనసులో,మేడమ్ ఎందుకు అంత భయపడుతున్నారా పిల్లని చూసి అని అనుకుంటాడు. అప్పుడు శివ వెళ్లి అక్కడ అంతా కొంటాడు దానికి సౌర్య ఎంతో సంతోషపడి ఆ మూలనున్న మేడమే నా పువ్వులు అన్ని కొంటున్నారు వెళ్లి థాంక్స్ చెప్పి వస్తాను అని సగం దూరం వెళ్తుండగా వారణాసి ఆపి, ఈ లెక్కలు చూడమ్మా అని అంటాడు. అప్పుడు సౌర్య తిరిగి వచ్చేస్తుంది అప్పుడు శివ సౌర్యతో ఏమమ్మ దిక్కులు చూస్తున్నావు, నువ్వు కూడా సద్దు అని అంటాడు. అప్పుడు శౌర్య కూడా వారణాసి తో పాటు సామాన్లని సద్దుతుంది. సామాన్లతో శివ తిరిగి కారులోకి వస్తాడు.
 

అప్పుడు కార్తీక్ శివని గట్టిగా చంప మీద ఒకటి కొడతాడు. ఎందుకు కొట్టారు అని అడగగా చిన్నపిల్లలు పనిచేస్తుంటేనే బాధగా ఉన్నది నువ్వు దానికి వెళ్లి పని చెప్తావ్ ఏంటి రా అని తిడతాడు. అప్పుడు మోనిత,ఈ గొడవలు మనకెందుకు కార్తీక్ ముందు ఇక్కడి నుంచి పోనీ అని అంటుంది. మనసులో, నీ కూతురు గుర్తు రాకపోయినా ప్రేమ మాత్రం తగ్గలేదు అయినా అందరూ ఇటువైపే వచ్చారు ఎందుకు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది.అప్పుడు శౌర్య, అన్ని డబ్బులు వచ్చినందుకు ఆనందపడుతుంది. చూసావా వారణాసి మన కష్టానికి ప్రతిఫలం దొరికింది అని అంటుంది. అయ్యో ఆవిడకి థాంక్స్ చెప్పడం మర్చిపోయాను అని వెళ్తుండగా ఆ కార్ వెళ్ళిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!