Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథా నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో ఒక సారి చూద్దాం.
కార్తీక్ (Karthik) ఆపరేషన్ థియేటర్ లో స్పృహ లేకుండా పేషెంట్ కు ఆపరేషన్ చేసిన సంగతి తెలిసిందే. రవి (Ravi) ఎంత చెప్పినా వినకుండా కార్తీక్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ అప్పటికే పేషెంట్ చనిపోతాడు.
210
దీంతో రవి (Ravi) పేషెంట్ ను చనిపోయాడు అని చంపేశావ్ కార్తీక్ అని అనేసరికి కార్తీక్ భయపడతాడు. వెంటనే కార్తీక్ కు (Karthik) పేషెంట్ బిడ్డలు, భార్య గుర్తుకు వస్తారు. వాళ్లతో మాట్లాడిన మాటలను తలుచుకుంటాడు.
310
మోనిత (Monitha) ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రియమణి (Priyamani) వచ్చి గట్టిగా పిలుస్తుంది. అంతలోనే మోనిత ఫోన్ కు జయంతి అనే ఆవిడ నుండి మెసేజ్ రావటంతో సంతోషంగా ఫీల్ అవుతుంది.
410
ప్రియమణి (Priyamani) మాత్రం ఏం చేయట్లేవు అని మోనితను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇక కార్తీక్ పని అయిపోయింది అని అంటుంది. ప్రియమణి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మోనిత (Monitha) మాత్రం కార్తీక్ పని అయినదన్నట్లు సంతోషపడుతుంది.
510
హాస్పిటల్ లో కార్తీక్ (Karthik)కు ఆపరేషన్ కి వెళ్లేముందు ఓ నర్సు వచ్చి టాబ్లెట్ వేసి కాఫీ ఇచ్చిన విషయాన్ని తలుచుకుంటుంది. కార్తీక్ కు అలా జరిగినందుకు తెగ సంతోష పడుతుంది మోనిత. మరోవైపు పేషెంట్ భార్య కార్తీక్ పై అరుస్తుంది.
610
ఇక హాస్పిటల్ లో ఉన్న వాళ్ళందరూ కార్తీకే (Karthik) తప్పు చేశాడు అనుకుంటారు. కార్తీక్ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆవిడ మాత్రం తన పిల్లలను పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. మీ పిల్లలకు పాపం కలుగుతుంది అంటూ శాపనార్థాలు పెడుతుంది ఆవిడ.
710
కార్తీక్ (Karthik) అక్కడినుంచి మౌనంగా వెళ్తూ ఆమె మాట్లాడిన మాటలు గురించి, ఆమె పెట్టిన శాపాలు గురించి తలుచుకొని బాధపడతాడు. ఇంట్లో ఆనందరావు, సౌందర్య (Soundarya) పిల్లలతో సరదాగా గడుపుతారు. పొడుపుకథలు వేసుకుంటూ సంతోషంగా కనిపిస్తారు.
810
ఇక సౌందర్య (Soundarya) కార్తీక్ గొప్పదనం గురించి పిల్లలకు చెబుతుంది. ఆనందరావు కూడా పిల్లలను తమ తండ్రిలాగా చదివి మంచి స్థాయికి రావాలని చెబుతాడు. ఇక హిమ (Hima) తన తండ్రి హాస్పిటల్ లో ఆపరేషన్ ఎలా చేస్తాడో చేసి చూపిస్తుంది.
910
కార్తీక్ (Karthik) హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఆ విషయాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. రవి (Ravi) మాటలు వింటే ఇలా జరిగేది కాదేమో అని ఆలోచిస్తాడు. ఈ చేతులతోనే ఇలా జరిగింది అని చేతులను కొట్టుకుంటాడు.
1010
అప్పుడే ఆ పేషెంట్ భార్య వచ్చి కార్తీక్ (Karthik) పై మళ్లీ అరుస్తుంది. మీ జీవితం నాశనం అవుతుంది అని మీ కుటుంబానికి నా ఉసురు తగులుతుంది అంటూ గట్టి శాపాలు పెడుతుంది. మరోవైపు ఇంట్లో పిల్లలు సంతోషంగా గడుపుతుంటారు. ఆదిత్య (Adithya) తో సరదాగా మాట్లాడుతుండగా అప్పుడే కార్తీక్ ఇంట్లోకి మౌనంగా వస్తాడు.