కథ:
జర్నలిస్ట్ గౌరీ (నిత్యా మీనన్) తాను పనిచేసే ఓ మ్యాగజైన్ నుండి తొలగించబడి సొంత ఊరు బండలింగంపల్లికి వచ్చేస్తుంది. రైటర్ గా తనని తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అదే ఊరికి చెందిన డాక్టర్ ఆనంద్(సత్య దేవ్) సస్పెండై సొంత ఊరిలో క్లినిక్ పెట్టుకోవాలనే ఆశతో తిరిగి వస్తాడు. మరోవైపు రామారావు(రాహుల్ రామకృష్ణ) తన ఫ్యామిలీ అప్పుల తీర్చడం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటాడు. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముగ్గురికి... సాంకేతిక లోపాలు తలెత్తి నాసా అంతరిక్షంలో నిర్మించిన స్కైలాబ్ క్రింద పడుతుందని, అది కూడా కరీంనగర్ జిల్లాలోని తమ గ్రామంపై పడి పెను ప్రమాదం సృష్టించనుందని తెలుస్తుంది. దీనితో ఆ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతారు. ఇంతకీ స్కైలాబ్ నిజంగానే బండలింగంపల్లి గ్రామాన్ని తాకిందా... కొద్దిరోజుల్లో పెను ప్రమాదమని తెలుసుకున్న గ్రామ ప్రజల ఫీలింగ్స్ ఏమిటీ? ఈ సంఘట గౌరీ, డాక్టర్ ఆనంద్, రామారావు జీవితాలను ఎలా మలుపు తిప్పింది? అనేది మిగతా కథ..