హిమ మాటలకు ఎమోషనలైనా కార్తీక్.. డాక్టర్ బాబుపై అనుమానం తెచ్చుకున్న భాగ్యం!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 15, 2021, 09:40 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
హిమ మాటలకు ఎమోషనలైనా కార్తీక్.. డాక్టర్ బాబుపై అనుమానం తెచ్చుకున్న భాగ్యం!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

210

హిమకు (hima) జ్వరం రావడంతో దీప అక్కడ కూర్చొని కార్తీక్ గురించి హిమకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. హిమ మాత్రం ఆ మాటలు వినకుండా తన తండ్రి మోసం చేశాడు అంటూ గట్టిగా అంటుంది. పక్కనే ఉన్న కార్తీక్ (Karthik) ఆ మాటలు వింటాడు.
 

310

కిందకు వచ్చి నేను మోసం చేయలేదని అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తాడు. దీప, హిమలతో (Deepa, Hima) పాటు అందరూ అక్కడికి వస్తారు. వెంటనే దీప కార్తీక్ (Karthik) దగ్గరికి వెళ్లి హిమపై కోపంగా అరుస్తుంది. ఎందుకిలా చేస్తున్నావు అంటూ బాధపడుతుంది.
 

410

సౌందర్య, దీప (Soundarya, Deepa) కార్తీక్ ను ఓదార్చుతారు. కార్తీక్ మాత్రం ఏ తప్పు చేయలేదు అంటూ మోసం చేయలేదు అంటూ బాగా ఏడుస్తాడు. హిమ పై నుండి చూస్తూ బాగా ఏడుస్తుంది. సౌర్య (sourya) మాత్రం ఏం పట్టనట్టు కోపంగా చూస్తుంది.
 

510

ఇదంతా ప్రియమణి (Priyamani) గమనిస్తుంది. కార్తీక్ బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సౌందర్య సౌర్య, హిమ పై అరుస్తుంది. మరోవైపు భాగ్యం (bhagyam) కార్తీక్, దీపల జీవితం బాగుండాలని, చక్కబడాలని దేవుడిని కోరుకుంటుంది.
 

610

అదే సమయంలో మురళీకృష్ణ ( Murali Krishna) వచ్చి భాగ్యంతో ఎమోషనల్ గా మాట్లాడుతాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బాధపడుతూనే ఉందని బాధపడతాడు. పిల్లలు కూడా దీపను (Deepa) అర్ధం చేసుకోవడం లేదని అంటాడు.
 

710

భాగ్యం (Bhagyam) కూడా బయట మాట్లాడిన మాటలు విన్నాను అంటూ.. కార్తీక్ పై కాస్త అనుమానం ఉందని అంటుంది. మోనిత (monitha) జైలు నుంచి విడుదలయ్యాక కార్తీక్ తనను ఇంట్లో ఉంచుకుంటాడు ఏమో అని అనేసరికి మురళీకృష్ణ తనపై కోపంగా అరుస్తాడు.
 

810

ఇక జైల్లో మోనిత కార్తీక్ గురించి తలుచుకుంటుంది.  సుకన్యతో (Sukanya) కార్తీక్ గురించి మాట్లాడుతుంది. దీప మాటలను తలుచుకొని కార్తీక్ టెన్షన్ పడాలి అంటూ అది చూసి కాంప్రమైజ్ కు దీప (Deepa) రావాలి అని రాక్షసంగా నవ్వుతుంది.
 

910

కార్తీక్ హిమ (Karthik, Hima) మాటలు తలుచుకొని బాధపడతాడు. దీప వచ్చి కార్తీక్ ను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. పిల్లలు కూడా అర్థం చేసుకోవడం లేదని మాట్లాడుకుంటారు. మోనిత (monitha) హాస్పిటల్ కు వచ్చిన విషయాన్ని గురించి ప్రశ్నిస్తుంది.
 

1010

ఇక కార్తీక్.. మోనిత ( Karthik, Monitha) మాములుది కాదని అంటూ ఆదిత్యకు యాక్సిడెంట్ చేయించిందని.. పిల్లలను చంపేస్తానని బెదిరించిందని అనేసరికి దీప (Deepa) షాక్ అవుతుంది. నిన్ను ఏం చేస్తుందో అని బాగా టెన్షన్ పడేవాడిని అంటూ భయంతో అలా ఉన్నానని ఎమోషనల్ గా చెబుతాడు.

click me!

Recommended Stories