మరోవైపు కార్తీక్, దీప (Deepa) పిల్లలతో కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇక హిమ నాన్నను ఎందుకు కార్తీక్ బాబు అని పిలుస్తున్నారు అనేసరికి కార్తీక్ ఇక్కడ డాక్టర్ అని ఎవరికి తెలియదని అందుకే అలా పిలుస్తున్నారని చెబుతాడు. అంతలోనే రుద్రాణి (Rudrani) వచ్చి పిల్లలకు స్వీట్స్ తీసుకొని వస్తుంది.