అప్పుడు కార్తీక్, మోనిత అని ఎన్ని రోజులైంది కార్తీక్ నీ నోట్లో నుంచి నా పేరు విని నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది మోనిత. జైల్లో ఉన్నన్ని రోజులు నీ గురించి నాకు దిగులు అందుకే నేరుగా జైలు నుంచి ఇక్కడికి వచ్చేసాను అంటుంది మోనిత. మీ పని మంచి పండరి అనుకుంట పాపం మీ మనిషి అని చెప్పగానే స్ట్రాంగ్ గా కాఫీ ఇచ్చింది. ఇకపై నేను కూడా నీతో పాటు కలిసి ఇక్కడే ఉంటాను ఆడడంతో దీప కోపంతో రగిలిపోతూ ఏంటే నువ్వు ఇక్కడ ఉండేది ముందు బయటికి వెళ్ళు అని అంటుంది. జైలుకు వెళ్లావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అనడంతో అలా ఎలా అనుకున్నావు దీపక్క ఆ జైలు గోడలు కార్తీక్ పై నాకున్న ప్రేమను అడ్డుకోలేకపోయాయి అని అనడంతో దీప,కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉంటారు.