ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ప్రీమియర్ టాక్... అల్లరి నరేష్ ఆశ తీరినట్లే, కాకపోతే ఆ సినిమాలా ఉందంటున్నారు!

First Published Nov 25, 2022, 7:55 AM IST

అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. పొలిటికల్ థ్రిల్లర్ గా దర్శకుడు ఏ ఆర్ మోహన్ తెరకెక్కించారు. నవంబర్ 25న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ టాక్ అందుతుండగా రెస్పాన్స్ ఏమిటో చూద్దాం... 
కథ 
 

Itlu Maredumilli prajaneekam review

శ్రీనివాస్ శ్రీపాద(అల్లరి నరేష్) ఒక గవర్నమెంట్ టీచర్. ఆయన ఎలక్షన్ డ్యూటీ పై మారేడుమిల్లి గ్రామానికి వెళతాడు. మారేడుమిల్లి అనే ఒక గ్రామం ఉందని, అది దేశంలో భాగం అని కూడా తెలియదు.  సమాజానికి దూరంగా బ్రతుకుతున్నమారేడుమిల్లి తండా ప్రజలను, వారి కష్టాలను, అక్కడ జరుగుతున్న అన్యాయాలను శ్రీనివాస్ శ్రీపాద ప్రపంచానికి తెలియజేయాలి అనుకుంటాడు. దాని కోసం వ్యవస్థ మీదే పోరాటం మొదలుపెడతాడు. మారేడుమిల్లి గ్రామ ప్రజల కష్టాలు తీర్చడంలో శ్రీనివాస్ శ్రీపాద ఎంత వర్కకు సక్సెస్ అయ్యారనేది కథ... 
 

Itlu Maredumilli prajaneekam review

21వ శతాబ్దంలో కూడా కొండ కోనల్లో అనాగరికులుగా బ్రతికేస్తున్న ప్రజలు చాలా మందే ఉన్నారు. వారి గురించి ఏ ప్రభుత్వం' నాయకులు పట్టించుకోరు. వారి హక్కుల గురించి తెలియని గిరిజనులు ఎలాంటి ఆదరణ, అభివృద్ధికి నోచుకోవడం లేదు.  విద్యా, వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేకుండా దేవుడిపై భారం వేసి బ్రతికేస్తుంటారు. వారిపై జరిగే అన్యాయాలు కూడా బయటకు రావు. 
 

Itlu Maredumilli prajaneekam review


ఇలాంటి ఓ సోషల్ బర్నింగ్ టాపిక్ తీసుకొని వాస్తవ సంఘటనల ఆధారంగా ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం మూవీ తెరకెక్కింది. హీరో నరేశ్ మరోసారి సీరియస్ రోల్ చేశారు. కామెడీ హీరోగా సంచలనాలు చేసిన అల్లరి నరేష్ కి ఆ ఫార్మాట్ కలిసి రావడం లేదు. అందుకే నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సబ్జక్ట్స్ చేస్తున్నారు. 
 

Itlu Maredumilli prajaneekam review

ప్రీమియర్ టాక్ ప్రకారం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీతో అల్లరి నరేష్ ఆకట్టుకున్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను చర్చిస్తూ, వాస్తవాలకు అద్దం పట్టేలా మూవీ ఉంది అంటున్నారు. స్కూల్ టీచర్ గా, ఎలక్షన్ అధికారికంగా అల్లరి నరేష్ నటన చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా సీరియస్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవాల్సిందే అంటున్నారు.

సపోర్టింగ్ రోల్ చేసిన వెన్నెల కిషోర్ స్పెషల్ అట్రాక్షన్. సీరియస్ సబ్జెక్టులో అప్పుడప్పుడూ ఆయన నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ ఆనంది తన పాత్ర పరిధి మేర అలరించారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె సహజంగా ఉన్నారు. సాంకేతిక వర్గం మెప్పించారు. 


ఎలాంటి కమర్షియల్ అంశాలు టచ్ చేయకుండా చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు నీట్ గా ప్రజెంట్ చేశారు. ఎమోషన్స్ మరింతగా బలంగా రాసుకొని ఉంటే బాగుండేదన్న భావన కలుగుతుంది. అల్లరి నరేష్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేయగల అంశాలు మూవీలో ఉన్నాయి. 
 

Itlu Maredumilli Prajaneekam


కాగా హిందీ హిట్ మూవీ న్యూటన్ కి చాలా దగ్గరగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ఉందన్న మాట వినిపిస్తోంది. మేకర్స్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా న్యూటన్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు ఏ ఆర్ మోహన్ కథను రాసుకొని ఉండవచ్చు. మొత్తంగా ఇట్లు మారేడుమిల్లి మూవీపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 

click me!