Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్

Published : Sep 13, 2026, 03:17 PM IST

తమిళ నటుడు కార్తీ.. హీరోయిన్ మాళవిక మోహనన్‌ను ఇటాలియన్ నటి మోనికా బెలూచీతో పోల్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'సర్దార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాళవిక డ్రెస్, లుక్‌పై కార్తీ ప్రశంసలు కురిపించారు.

PREV
15
నటి మాళవిక మోహనన్

మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ ఇండియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ.. తన గ్లామర్, నటనతో అభిమానులు ను ఆకట్టుకుంటోంది.

25
హీరో కార్తీ చేసిన ఓ కామెంట్
ఇప్పుడు మాళవిక మోహనన్ గురించి తమిళ స్టార్ హీరో కార్తీ చేసిన ఓ కామెంట్ పెద్ద చర్చకు దారితీసింది. మాళవికను హాలీవుడ్ నటి, గ్లోబల్ బ్యూటీ మోనికా బెలూచీతో కార్తీ పోల్చడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
35
సర్దార్ 2

కార్తీ, మాళవిక మోహనన్ కలిసి నటించిన 'సర్దార్ 2' సినిమాపై భారీఅంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ మాళవిక గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

45
అచ్చం మోనికా బెలూచీలా
ఈవెంట్‌లో మాళవిక ధరించిన డ్రెస్ గురించి కార్తీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ డ్రెస్‌లో ఆమె అచ్చం మోనికా బెలూచీలా కనిపిస్తోందని చెప్పాడు. ఓ హీరోయిన్ అందాన్ని అంతర్జాతీయ నటితో పోల్చడం అందరి దృష్టిని ఆకర్షించింది.
55
సోషల్ మీడియాలో చర్చ
అయితే కార్తీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొందరు దీన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు ఇలాంటి పోలిక అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ చర్చలను మాళవిక పెద్దగా పట్టించుకోలేదు. కార్తీ చాలా మంచి వ్యక్తి, జెంటిల్మెన్ అని ప్రశంసించింది.
Read more Photos on
click me!

Recommended Stories