ఈ ముద్దుగుమ్మ డ్రెస్‌ రేట్‌ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

First Published | Jul 31, 2020, 2:10 PM IST

కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్ని నిలిచిపోవటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి త్రో బ్యాక్‌ ఫోటోలు, గతంలో వైరల్‌ వార్తలు మరోసారి తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీనా డ్రెస్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బెబో కరీనాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్‌ అయ్యాయి. తన కొడుకు తైమూర్‌ అలీ ఖాన్తో కలిసి కరీనా, కరీష్మా ఇంటికి వెళ్లిన సమయంలో కెమెరాలు క్లిక్‌ మనిపించాయి.
undefined
ఆ సమయంలో కరీనా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌ డ్రెస్‌ వేసుకొని ఉంది. ఆ డ్రెస్‌ చూడటానికి సింపుల్‌గానే ఉన్నా.. దాని ధర తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే.
undefined
Tap to resize

పట్టు క్లాత్‌ తో రూపొందించిన ఆ డ్రెస్‌ బిషప్‌ స్లీవ్స్‌, డీప్‌ లో నెక్‌తో మోడ్రన్‌గా ఉంది. డ్రెస్‌కి ఉన్న స్లిట్‌ డ్రెస్‌కు మరింత గ్లామర్‌ తీసుకువచ్చింది.
undefined
బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్న కరీనా తన హెయిర్‌ను బన్‌లా పెట్టుకొని ఉంది. పాదాలకు సింపుల్‌ గోల్డ్‌ కలర్‌ స్లిపర్స్‌తో పాటు కేవలం ఎంగేజ్‌మెంట్ రింగ్, ఓ గొలుసు మాత్రమే ధరించింది.
undefined
అయితే ఆ సమయంలో కరీనా ధరించిన పట్లు డ్రెస్‌ ధర దాదాపు రూ. 13,500 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
undefined
ఈ డ్రెస్‌ను హెచ్‌ అండ్‌ ఎం సంస్థ కరీనా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసింది.
undefined

Latest Videos

click me!