దర్శకుడు సూర్య కిరణ్ అకాలమరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత చిన్న వయసులో అనార్యోగంతో చనిపోవడం ఏమిటనే సందేహాలు మొదలయ్యాయి. కాగా సూర్య కిరణ్ మరణం వెనకున్న అసలు నిజాలు కరాటే కళ్యాణి బయటపెట్టింది.
బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన సూర్య కిరణ్ దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించాడు. 1990 వరకు అతడు నటుడిగా కొనసాగాడు. 2003లో వచ్చిన సత్యం మూవీతో దర్శకుడు అయ్యాడు. సుమంత్-జెనీలియా జంటగా తెరకెక్కిన సత్యం సూపర్ హిట్. అయితే అనంతరం ఆయన దర్శకత్వం వహించిన ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
26
surya kiran
కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న సూర్య కిరణ్ ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సూర్య కిరణ్ మరణించాడంటూ కథనాలు వెలువడ్డాయి. మార్చి 11న సూర్య కిరణ్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. జాండిస్ బారిన పడిన సూర్య కిరణ్ మరణించాడు.
36
Surya Kiran
సూర్య కిరణ్ చావుకు అసలు కారణాలు ఏమిటో అతనితో అనుబంధం ఉన్న నటి కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి ఈ మేరకు కొన్ని కామెంట్స్ చేసింది. భార్యతో విడాకులే సూర్య కిరణ్ దుస్థితికి కారణం అని కరాటే కళ్యాణి అన్నారు.
46
సూర్య కిరణ్ మంచి నటుడు, డాన్సర్, సింగర్, దర్శకుడు. బాల నటుడిగా రెండు వందలకు పైగా చిత్రాలు చేశాడు. నంది అవార్డులు అందుకున్నాడు. ఆమెతో విడాకులు అయ్యాక సూర్య కిరణ్ వేదనకు గురయ్యాడు. ఆమెను గుండెల నిండా నింపుకున్నాడు. ఆమె దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు.
56
ఇంకా లోకంలో నాకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడు. రాత్రంతా మందు, సిగరెట్స్ తాగుతూ ఉంటే బాడీ ఎన్నాళ్ళు సహకరిస్తుంది. ఆ దురలవాట్లతో సూర్య కిరణ్ ఆరోగ్యం దెబ్బతింది. తాగుడు వలనే సూర్య కిరణ్ కి జాండిస్ వచ్చింది. అందుకే మరణించాడు, అని చెప్పుకొచ్చింది.
66
హీరోయిన్ కళ్యాణి అలియాస్ కావేరిని సూర్య కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. తాను వదిలి వెళ్లినా, నేను కావాలి అనుకుంటున్నట్లు బిగ్ బాస్ హౌస్లో సూర్య కిరణ్ చెప్పారు. బిగ్ బాస్ తెలుగు 4లో సూర్య కిరణ్, కరాటే కళ్యాణి పాల్గొన్నారు.