తెలుగు చిత్రసీమలో విజయవంతమైన నటీమణులలో అనుష్క శెట్టి ఒకరు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో వెలుగొందింది. ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
26
చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో అలరించింది. అయితే అనుష్క శెట్టి కొన్నాళ్లుగా మీడియాకు చాలా దూరంగా ఉంటోంది. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎలా ఉందనేది స్పష్టత లేకపోయింది.
36
ఆ మధ్యలో బరువు కారణంగా అనుష్క పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని.. దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది.
46
తాజాగా అనుష్క శెట్టి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో తను నటించిన కొత్త చిత్రం యూనిట్ తో ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చింది.
56
ఈ ఫోటోలో అనుష్క అందంగా, నిర్మలంగా కనిపిస్తోంది. ఆమె నిండు వైభవంగా, ఆనందంగా, నవ్వుతూ కనిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆమె ఆరోగ్యంగా ఉందని తేలిపోయింది.
66
చాలా కాలం తర్వాత తమ అభిమాన నటిని చూడడంతో ఆమె అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన మలయాళ హారర్-ఫాంటసీ డ్రామా ‘కథనార్’ (Kathanar) చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది.