సడెన్‌గా అలియా ప్రెగ్నెంట్ అనే వార్తలు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ కావడం విశేషం. ఎవరూ ఊహించలేదు. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట అప్పుడే పిల్లలు కనాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అప్పటి నుంచి ఓ రెండు మూడు వివాదాలను కూడా ఫేస్ చేసింది ఆలియా. ఒక విషయంలో మాత్రం కాస్త ఘాటుగానే స్పందించింది.