కళ్ళ ముందే భార్య అక్రమ సంబంధం, 11 నెలలుగా.. టీవీ నటుడు సంచలన ఆరోపణలు

Published : May 24, 2022, 04:31 PM IST

హిందీ బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా, అతడి భార్య నిషా రావాల్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరూ కోర్టులో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు.

PREV
16
కళ్ళ ముందే భార్య అక్రమ సంబంధం, 11 నెలలుగా.. టీవీ నటుడు సంచలన ఆరోపణలు

చిత్ర పరిశ్రమలో లవ్ అఫైర్స్ గురించి తరచుగా వార్తలు వింటుంటాం. నటీ నటుల మధ్య ప్రేమ చిగురించడం సహజం. కొన్ని రిలేషన్ షిప్స్ పెళ్లి వరకు వెళుతుంటాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోతుంటాయి. కానీ పెళ్లి తర్వాత విడిపోవాల్సి వస్తే తీవ్రమైన మానసిక వేదన మిగులుతుంది.   

26

హిందీ బుల్లితెర నటుడు కరణ్ మెహ్రా, అతడి భార్య నిషా రావాల్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరూ కోర్టులో విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. గతంలో నిషా.. తన భర్త కరణ్ పై గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసులో కరణ్ మెహ్రా బెయిల్ పై విడుదల అయ్యాడు. 

36

తన నుంచి భారీగా భరణం పొందేందుకు నిషా కుట్ర చేస్తోందని కరణ్ ఆరోపించారు. అందుకే తనని తానే గాయపరుచుకుని నాపై నిందలు వేస్తోంది. నిషా వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత 11 నెలలుగా ఒక వ్యక్తితో నిషా నా ఇంట్లోనే నివసిస్తోంది. అతడు భార్య పిల్లల్ని విడిచిపెట్టిన నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. 

46

ఇప్పుడు వీరిద్దరూ కలసి నా ఆస్తులు, ఇల్లు, కార్లు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ కరణ్ మెహ్రా సంచలన ఆరోపణలు చేశారు. కరణ్, నిషా దంపతులకు ఒక కొడుకు సంతానం ఉన్నారు. 

 

56

2012లో వివాహం చేసుకున్న వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి విభేదాలతో విడిగా జీవిస్తున్నారు. కరణ్ మెహ్రా తన భార్యపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేయడం.. ఆమె అతడిపై గృహ హింస ఆరోపణలు చేస్తుండడంతో ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. 

66

కరణ్ ఆరోపణలపై నిషా స్పందించింది. అతడి నుంచి తనకు ఎలాంటి భరణం అవసరం లేదు అని తేల్చి చెప్పింది. సొంతంగా సంపాదించుకుంటున్నప్పుడు ఎవరి భరణం తనకు అక్కర్లేదని నిషా రావల్ పేర్కొంది. 

click me!

Recommended Stories