Published : May 24, 2022, 03:33 PM ISTUpdated : May 24, 2022, 03:38 PM IST
సినిమా వాళ్ళు చాలా కమర్షియల్. కానీ అందరూ కాదు, రేణూ దేశాయ్ లాంటి ఎమోషనల్ పర్సన్స్ కూడా ఉంటారు. ప్రేమ కోసం బంగారం లాంటి కెరీర్ తృణ ప్రాయంగా వదిలేసింది. ఆమె మొదటి చిత్రం బద్రి సూపర్ హిట్... దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. అప్పటికే పవన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రేణూ దేశాయ్ హీరోయిన్ గా రిటైర్ అయ్యారు.
2000 లో మొదలైన పవన్-రేణూ (Renu Desai) ప్రయాణం 2011 వరకూ సాగింది. ఈ క్రమంలో అకీరా, ఆద్య లకు ఆమె తల్లయ్యారు. మనస్పర్థల కారణంగా 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. రేణూతో విడిపోయిన ఏడాదికి రష్యన్ నటి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు.
27
విడాకుల తర్వాత రేణూ దేశాయ్ పవన్ (Pawan Kalyan) పై పలు ఆరోపణలు చేశారు. తనతో ఉంటూనే వేరే అమ్మాయితో పవన్ సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు. ఇక భరణంగా నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈ రోజుకు కూడా కేవలం నా సంపాదనతో పిల్లల్ని పోషిస్తున్నాను, పవన్ నాకు కోట్ల రూపాయలిచ్చాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని పలు ఇంటర్వ్యూలో చెప్పారు.
37
పూణేకు మకాం మార్చిన రేణూ రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. రేణూ నిర్ణయాన్ని పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెపై సోషల్ మీడియా దాడులకు దిగారు. పవన్ ఫ్యాన్స్ వేధింపులకు గురిచేస్తున్నారని, రేణూ ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిగత జీవితంతో మీకేంటి సంబంధం అంటూ... ధ్వజమెత్తారు. సామాజికవాదులు, మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచారు.
47
రేణూ రెండో వివాహాన్ని ఆపడం కోసం తెరవెనుక చాలా తతంగం నడిచినట్లు టాక్. నయానో భయానో రేణూ పెళ్లి ఆలోచన విరమించుకునేలా చేశారు. ఇక అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పూణే వెళుతూ ఉండేవారు. అలాగే మెగా ఫ్యామిలీలో జరిగే వేడుకలకు పిల్లలు మాత్రం హాజరయ్యేవారు. కానీ రేణూ దేశాయ్ ని పవన్ దూరంగా ఉంచేవారు.
57
విడాకుల తర్వాత పవన్ రేణూ కలిసున్న ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మాజీ దంపతులు ఓకే ఫ్రేమ్ లో కనిపించి షాక్ ఇచ్చారు. కొడుకు అకీరా నందన్ (Akira Nandan) స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఈ కార్యక్రమానికి పవన్, రేణూ దేశాయ్ కలిసి పాల్గొన్నారు. పిల్లలతో పాటు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
67
Pawan Kalyan - Renu desai
దీంతో పవన్-రేణూ రిలేషన్ పై తెరలు వీడాయి. విడిపోయినప్పటికీ రేణూ, పవన్ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగుతున్నాయని అర్థమైంది. కేవలం పిల్లలతో మాట్లాడే పవన్ రేణూ ఎడమొహం పెడమొహంగా ఉంటాడన్న పుకార్లకు చెక్ పెట్టారు. పూణే నుండి హైదరాబాద్ కి రేణూ మకాం మార్చడం వెనుక కారణం కూడా ఇదే అనిపిస్తుంది.
77
ఇక విడాకుల తర్వాత కూడా స్నేహం కొనసాగించడం లేటెస్ట్ ఫ్యాషన్. అమీర్ ఖాన్-కిరణ్ రావ్, హ్రితిక్ రోషన్- సుసానే ఖాన్ ఇదే తరహా రిలేషన్ మైంటైన్ చేస్తున్నారు. చట్టపరంగా విడిపోయినప్పటికీ కలవడం, మాట్లాడుకోవడం, పిల్లతో పాటు విహారాలకు వెళ్లడం చేస్తున్నారు. ఇక ఇన్నేళ్ల తర్వాత పవన్ రేణూతో పాటు ఫోటో దిగడం వెనుక మరొక కారణం కూడా ఉండవచ్చు. పిల్లల పోషణ భార్యపై వదిలేసి మూడో వివాహం చేసుకున్నాడనే అపవాదును పోగొట్టుకునే ప్రయత్నం కావచ్చు. కారణం ఏదైనా ఎట్టకేలకు పవన్-రేణూ తెరల మాటు నుండి బయటికొచ్చారు.