Kara Movie First Review: ధనుష్‌ `కర` మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.. హైలైట్స్ ఇవే, కానీ మైనస్‌ ఏంటంటే?

Published : Apr 29, 2026, 11:25 AM IST

ధనుష్‌ హీరోగా నటించిన `కర` మూవీ ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందబోతుందనేది ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమాలో హైలైట్స్ ఏంటో తెలిసిపోయింది. 

PREV
15
ధనుష్‌ కర మూవీ ఏప్రిల్‌ 30న విడుదల

ధనుష్‌ చివరగా `కుబేర`తో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన `ఇడ్లీ కొట్టు`తో అలరించలేకపోయారు. ఇప్పుడు `కర` అనే చిత్రంలో హీరోగా నటించారు. మమితా బైజు ఇందులో హీరోయిన్‌గా నటించింది. విఘ్నేష్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఐషరి కె గణేష్‌ ఈ మూవీని తమిళంలో నిర్మించారు. తెలుగులో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 30న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

25
కర మూవీ సెన్సార్‌ రిపోర్ట్

తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు ఏ సర్టిఫికేట్‌ని పొందింది. సినిమా నిడివి 161.13 నిమిషాలు ఉంటుందట. రెండు గంటల 41 నిమిషాలు ఉంటుందని తెలిసింది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. ధనుష్‌, చిత్ర దర్శకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్, నటుడు సూరజ్‌ వెంజరమూడు ఇలా చాలా మంది సినిమా గురించి మాట్లాడారు. అద్భుతంగా ఉంటుందన్నారు. ఒక ఆర్డినరీ మ్యాన్‌ అసాధారణమైన పరిస్థితుల్లో ఇరుక్కుంటే, దాన్నుంచి ఎలా బయటపడ్డాడు, అందుకోసం ఏం చేశాడనేది కథ అని ధనుష్ తెలిపారు.

35
కర మూవీ ఫస్ట్ రివ్యూ

ఇందులో ధనుష్‌ కరస్వామి అనే దొంగగా కనిపిస్తాడట. గ్రామీణ నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. దొంగగా ఉన్న కరస్వామి ఆ పని వదిలేసి ఊరికొస్తాడట. కొన్ని కారణాలతో మళ్లీ తాను దొంగగా మారాల్సి వస్తుందట. బ్యాంకులను రాబరీకి పాల్పడుతుంటాడట. మరి దానికి దారితీసిన అంశాలేంటనేది? సినిమా. 1991లో ఇంధన సంక్షోభ సమయంలో దోపిడీలు చోటు చేసుకుంటున్న వేళ  మనుగడకు, పాపానికి మధ్య చిక్కుకున్న వ్యక్తి కథే ఈ మూవీ అని టీమ్‌ చెబుతోంది.

45
థ్రిల్లర్‌ హైలైట్‌

 ఈ మూవీ బాగా వచ్చిందని, దర్శకుడు విఘ్నేష్‌ రాజా పేరు చాలా కాలం వినిపిస్తుందని ధనుష్‌ తెలిపారు. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్పందిస్తూ, ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్‌ అని, యాక్షన్‌ అదిరిపోతుందని, ఆడియెన్స్ కి బాగా నచ్చుతుందని వెల్లడించారు. సినిమా 90 బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట. ఆద్యంతం ఎంగేజ్‌ చేస్తుందని నటుడు సూరజ్‌ వెల్లడించారు. ఆయన ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడట.

55
హాలీవుడ్‌ స్టయిల్‌ ఫ్లేవర్‌.. మైనస్‌ ఏంటంటే?

ఇది ఎమోషన్స్ రూటెడ్‌గా ఉండే మూవీ అని హీరోయిన్‌ మమితా బైజు తెలిపారు. ఇందులో ధనుష్‌కి భార్యగా మమితా బైజు కనిపిస్తుంది. ఆమె చుట్టూనే సినిమా తిరుగుతుందని సమాచారం. బలమైన సస్పెన్స్ అంశాలతో కూడిన గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక హాలీవుడ్‌ తరహా దోపిడీ థ్రిల్లర్‌ మూవీ అని దర్శకుడు తెలిపారు. ఇలా టీమ్‌ హైప్‌ ఇస్తోంది. కానీ సినిమాకి రావాల్సిన బజ్‌ రాలేదు. ప్రమోషన్స్ పరంగా కొంత వీక్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. మరోవైపు సినిమా స్లోగా సాగుతుందట. ఇవి కొంత మైనస్‌గా నిలుస్తాయని అంటున్నారు. కానీ కథ బలంగా ఉంటుందని, సినిమా సాగే కొద్ది ఎంగేజ్‌ చేస్తుందని చెబుతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో ఏసియానెట్‌ పూర్తి రివ్యూ కోసం వేచిఉండండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories