కపూర్ ఫ్యామిలీలో మరో పెళ్లి సందడి మొదలైంది. అన్షులా కపూర్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ రోహన్ థక్కర్‌ను జూలై 6న పెళ్లి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్ తారలు అదిరిపోయే ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిశారు.
కపూర్ ఫ్యామిలీలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అన్షులా కపూర్ జూలై 6న తన ప్రియుడు రోహన్ థక్కర్‌ను పెళ్లాడనుంది. గత నెలలో రోహన్ కుటుంబం 'మాతా కీ చౌకీ' నిర్వహించగా, ఇప్పుడు కపూర్ ఇంట్లో మెహందీ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు అన్షులా నీలం రంగు లెహెంగాలో మెరిసింది. పటోలా డిజైన్‌తో, అద్దాల వర్క్‌తో ఉన్న ఈ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. దీనికి తగ్గట్టుగా టర్కోయిస్ జ్యువెలరీ, సింపుల్ మేకప్‌తో ఆకట్టుకుంది.
26
అన్షులా సోదరీమణులు
ఈ మెహందీ వేడుక ఏర్పాట్లన్నీ అన్షులా సోదరీమణులు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ దగ్గరుండి చూసుకున్నారట. ఈవెంట్ సక్సెస్ చేయడమే కాదు, తమ ఫ్యాషన్ సెన్స్‌తోనూ వీళ్లిద్దరూ అదరగొట్టారు. జాన్వీ పింక్ కలర్ వన్-షోల్డర్ గౌనులో స్టైలిష్‌గా కనిపిస్తే, ఖుషీ గోల్డెన్ శారీలో ట్రెడిషనల్‌గా మెరిసింది. వాళ్ల నాన్న బోనీ కపూర్ బ్లూ కుర్తా-పైజామాలో క్లాసిక్‌గా కనిపించారు.
36
గ్లామరస్ లుక్ లో షనాయా కపూర్
ఈ వేడుకలో షనాయా కపూర్ తన స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు, పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఇండో-ఫ్యూజన్ డ్రెస్ వేసుకుంది. ఆఫ్-షోల్డర్ బ్లౌజ్, గోల్డెన్ డిటైలింగ్‌తో ఉన్న స్కర్ట్‌లో చాలా ట్రెండీగా కనిపించింది. పాపిడి బిళ్ల, చోకర్ నెక్లెస్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది.
సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఈ వేడుకకు హాజరై కాబోయే వధువు అన్షులాను ఆశీర్వదించారు. ఆమె ఎరుపు రంగు కఫ్తాన్ డ్రెస్‌లో, ముత్యాల హారంతో చాలా హుందాగా కనిపించారు. ఈ వేడుకకు వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు నీలం, పసుపు, పింక్, గోల్డ్ వంటి బ్రైట్ కలర్స్‌లో మెరిశారు. మెహందీ వేడుక ఫోటోలు చూశాక, ఫ్యాన్స్ ఇప్పుడు అన్షులా-రోహన్ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు.
56
సోనమ్ కపూర్
కజిన్ అన్షులా మెహందీ ఫంక్షన్‌లో సోనమ్ కపూర్ కూడా ప్రత్యేకంగా మెరిసింది. ఆమె లేత నీలం రంగు ట్రెడిషనల్ సూట్ ధరించింది. దీనికి కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చ రంగు దుపట్టా, గోల్డెన్ బోర్డర్‌తో చాలా రాయల్‌గా కనిపించింది. పెద్ద చెవిపోగులు, గాజులతో, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది.
66
జాన్వీ కపూర్
కజిన్ అన్షులా మెహందీ ఫంక్షన్‌లో సోనమ్ కపూర్ కూడా ప్రత్యేకంగా మెరిసింది. ఆమె లేత నీలం రంగు ట్రెడిషనల్ సూట్ ధరించింది. దీనికి కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చ రంగు దుపట్టా, గోల్డెన్ బోర్డర్‌తో చాలా రాయల్‌గా కనిపించింది. పెద్ద చెవిపోగులు, గాజులతో, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. ఇటీవల పెద్ది చిత్రంతో సందడి చేసిన జాన్వీ కపూర్ అయితే సింపుల్ లుక్ లో మెరిసింది.