కాంతార చాప్టర్ 1 దెబ్బకు బాక్సాఫీస్ షేక్, రిషబ్ శెట్టి మూవీ 7 రోజులకు ఎంత వసూలు చేసింది?

Published : Oct 09, 2025, 08:01 AM ISTUpdated : Oct 09, 2025, 08:30 AM IST

కాంతార చాప్టర్ 1 వరల్డ్‌వైడ్  గా  బాక్సాఫీస్ ను షేక్  చేస్తోంది.  రిషబ్ శెట్టి సినిమా సౌత్ రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

PREV
16
కాంతార చాప్టర్ 1 వరల్డ్‌వైడ్ రిపోర్టు

రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన  జానపద చిత్రం, కాంతార చాప్టర్ 1. వరల్డ్ వైడ్ గా బాాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ఈసినిమా.  అధికారికంగా ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ చిత్రంగా నిలిచింది. కెజియఫ్ రికార్డులను బ్రేక్ చేయడానికి దూసుకుపోతోంది కాంతార 1.

26
వారంలోనే భారీగా వసూళ్లు

సక్నిల్క్ నివేదిక ప్రకారం, కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 410 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది మొదటి భాగం కాంతార (రూ.408 కోట్లు) మొత్తం వసూళ్లను దాటేసింది. వారం రోజుల్లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార1, నెక్ట్స్ 1000 కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్ గా ఉరకలు వేస్తోంది. 

36
రిషబ్ శెట్టి టార్గెట్ కంప్లీట్ చేస్తాడా?

రిషబ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' ఇప్పుడు యశ్ 'KGF చాప్టర్ 2' (రూ.1215 కోట్లు) తర్వాతే ఉంది. KGF చాప్టర్ 1 (రూ.238 కోట్లు) నాలుగో స్థానంలో ఉంది. కెజియఫ్ చాప్టర్ 1ను క్రాస్ చేసిన కాంతార చాప్టర్ 1, నెక్ట్స్ కెజియఫ్ 2 రికార్డ్స్ ను బ్రేక్ చేయడమేలక్ష్యంగా పెట్టుకుంది. అది జరిగితే కన్నడాలో యష్ ను దాటుకుని రిషబ్ శెట్టి ఇమేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. 

46
ప్రాథమిక అంచనాలు ఇవే

సక్నిల్క్ ప్రకారం, కాంతార చాప్టర్ 1 బుధవారం రాత్రి 8 గంటల వరకు రూ.15.42 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో  306.42 కోట్లు కొల్లగొట్టిన ఈసినిమా ఇంకా హౌస్ ఫుల్ రన్ తో నడుస్తున్నట్టు తెలుస్తోంది. 

56
పెరుగుతున్న కలెక్షన్లు

సోమవారం వసూళ్లు 50.40% తగ్గినా, 31.25 కోట్లతో నిలకడగా ఉంది. మంగళవారం మాత్రం కలెక్షన్లలో  7.14% వృద్ధి కనిపించింది. బుధవారం కూడా మంచి వసూళ్లు కొనసాగించింది. ఇదే కొనసాగితే.. ఈ వీకెండ్ కూడా కాంతారకు కలిసివచ్చే అవకాశం ఉంది. దాంతో వసూళ్లు ఇంకాపెరుగుతాయని అంటున్నారు. 

66
అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్

కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్  సాధించింది కాంతార ఛాప్టర్ 1. 

Read more Photos on
click me!

Recommended Stories