Allu Arjun: అల్లు అర్జున్ తన తదుపరి సినిమా గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పుష్ప 2 తర్వాత తన మార్కెట్ నిలబెట్టుకునే సినిమా కోసం ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు.
Allu Arjun Next Big Venture: Still in the Works!in telugu
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ ఏం సినిమా చేయబోతున్నాడనే విషయం గత కొద్ది రోజులుగా అంతటా హాట్ టాపిక్ గా ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఇప్పటిదాకా ఇంకా అల్లు అర్జున్ ఏ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
చాలా డైలమోలో ఉన్నారు. తన టీమ్ తో కలసి రకరకాల లెక్కలు, అంచనాలు వేస్తున్నారు. పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేస్తే వర్కవుట్ అవుతుంది. తన మార్కెట్ పడిపోకుండా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుందనే విషయం తేల్చుకోలేకపోతున్నారు.
23
Allu Arjun Next Big Venture: Still in the Works!in telugu
అల్లు అర్జున్ చుట్టూ చాలా మంది నిర్మాతలు, దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఏ కథ చేస్తే తనకు వచ్చిన ప్యాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోగలగుతాడు అనేది తేలటం లేదట.
అయితే అర్జెంటు గా ఏదో ఒకటి ఓకే చెయ్యాలనుకోవటం లేదు. ఫిల్మ్ మేకర్స్ తో డిస్కషన్స్ చేస్తున్నారు. కథలు వింటున్నారు. అటు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కథలో వచ్చే మార్పులు తెలుసుకుంటున్నారు. అట్లీని తరుచుగా కలుస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడా ముందుకు వెళ్దాం అని లాక్ చెయ్యలేయటం లేదు.
33
Allu Arjun Next Big Venture: Still in the Works!in telugu
తన కెరీర్ లో ఇది పీక్ గా అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తను వెనక్కి వచ్చేస్తాడు. కథలో కొత్తదనం కావాలి. అది ప్యాన్ ఇండియా మార్కెట్ ని సంతృప్తి పరచాలి. పుష్ప 2 తర్వాత చేస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉంటాయి.
ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా పై నుంచి క్రిందకి పడిపోయినట్లే. ఇది చాలా మంది హీరోల కెరీర్ లో గతంలో జరిగింది. తనకు అలాంటిది జరగకూడదని అనుకుంటున్నాడు. అలాగే కేరళ, తమిళ మార్కెట్ లో పుష్ప 2 పెద్దగా ఆడకపోవటాన్ని దృష్టిలో పెట్టుకోవాలనుకుంటున్నారు. నార్త్ మార్కెట్ ని ఎట్టి పరిస్దితుల్లో చేజారకూడదనుకుంటున్నాడు. ఇన్ని అల్లు అర్జున్ ఎదుట కనపడుతున్నాయి. దాంతో ఎటు వైపు వెళ్లాలో తెలియని సందిగ్దావస్దలో ఉన్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.