దారుణంగా కలెక్షన్స్, నాలుగు రోజులకు వచ్చింది ఇంతేనా?

Published : Mar 02, 2025, 04:26 PM IST

Mazaka Movie Misfire: సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మొదటి రోజు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, తరువాత కలెక్షన్లు బాగా పడిపోయాయి, దీంతో బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది.

PREV
13
  దారుణంగా కలెక్షన్స్, నాలుగు రోజులకు వచ్చింది ఇంతేనా?
Mazaka Movie Misfire: What Went Wrong with This Highly Anticipated Film

Mazaka Movie Misfire:  శివరాత్రి కానుకగా వచ్చిన సందీప్ కిషన్ మజాకా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర  ఏమీ వర్కవుట్ కావటం లేదు. ఈ సినిమాకి  మీడియా నుండి డీసెంట్ రిపోర్ట్ లు వచ్చినా ఫలితం కనపడటం లేదు.  

సందీప్ కిషన్ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని చెప్తున్నా కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయంటోంది ట్రేడ్.  ఫస్ట్ డే బాగానే ఉందనుకున్నా తర్వాత  వర్కింగ్ డేస్ లో  పూర్తి డ్రాప్ కనపడింది. దాంతో వీకెండ్ మీదే ఆశలు పెట్టుకుంది టీమ్. అయితే ఇప్పుడు అది కూడా ఏమీ ఫలితం లేదని తెలుస్తోంది. 
 

23
Mazaka Movie Misfire: What Went Wrong with This Highly Anticipated Film


మజాకా సినిమా  4వ రోజున శనివారం ఎట్టకేలకు కొద్ది వరకు గ్రోత్ ని చూపించినా అనుకున్న స్దాయిలో లేవు కలెక్షన్స్.  ఈవినింగ్స్ జనాలు థియేటర్స్ దగ్గర కనపడ్డారు. దాంతో ట్రెండ్  మారినా కూడా సినిమా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది.

ఈ సినిమా ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ చూస్తే ఆదివారం కూడా అంతంత మాత్రంగానే ఉంది.  సినిమాపై ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని కొనుక్కున్న బయ్యర్లకు 1/3 కూడా రికవరీ ఉండని అంటోంది ట్రేడ్. అదే జరగితే పెద్ద డిజాస్టర్ క్రిందే లెక్క. 
 

33
Mazaka Movie Misfire: What Went Wrong with This Highly Anticipated Film


నాలుగు  రోజుల  కలెక్షన్స్ డిటేల్స్  (ఏరియా వైజ్)

 నైజాం    1.24Cr
సీడెడ్     51L
ఆంధ్రా               1.46Cr

ఏపీ + తెలంగాణ (టోటల్)    3.21CR(5.90CR~ Gross)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్     67L 
తెలుగు వెర్షన్ (టోటల్)     3.88CR(Gross – 7.60CR~)

‘మజాకా’ (Mazaka ) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పరిస్దితి చూస్తుంటే కష్టంగానే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories