చాలా కాలంగా టాలీవుడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది టీమ్. మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈసినిమా నుంచి మహాశివరాత్రి కానుకగా మేకర్స్ మంచు విష్ణు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఈ ఫస్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు.