నాగార్జునపై ప్రేమతోనే టబు మ్యారేజ్‌ చేసుకోలేదా.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన నాగ్‌.. ఇప్పటికీ టచ్‌లోనే

Published : Mar 08, 2024, 04:51 PM ISTUpdated : Mar 09, 2024, 11:17 AM IST

టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున, అందాల తార టబు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, నాగార్జునపై ప్రేమతోనే టబు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందనే ప్రచారం ఉంది. దీనిపై నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. 

PREV
18
నాగార్జునపై ప్రేమతోనే టబు మ్యారేజ్‌ చేసుకోలేదా.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన నాగ్‌.. ఇప్పటికీ టచ్‌లోనే

టబు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించినా తెలుగులోనూ కొన్ని సినిమాల్లో మెరిసింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్‌ వంటి టాప్‌ స్టార్స్ తో కలిసి నటించింది. అందులోనూ నాగార్జునతో మూడు సినిమాలు చేసింది. వీరి కెమిస్ట్రీ వెండితెరపై బాగా వర్కౌట్‌ అయ్యింది. ముఖ్యంగా `నిన్నే పెళ్లాడతా`లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుంది. దీంతోపాటు `ఆవిడా మా ఆవిడే` చిత్రంలోనూ కలిసి నటించారు. దీంతోపాటు `సిసిద్రి`లో గెస్ట్ రోల్‌లో మెరిసింది.
 

28

ఇలా మూడు సినిమాలతో ఈ ఇద్దరి మధ్య బాండింగ్‌ బాగా పెరిగింది. అది స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమ అని అంతా మాట్లాడుకుంటే, బెస్ట్ ఫ్రెండ్ అని నాగ్‌ చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య బాండింగ్‌ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందట. నాగార్జునకి టబు ఇప్పటికీ ఫోన్‌ చేస్తుందట. అర్థరాత్రి కూడా నాగార్జున సీక్రెట్‌ (పర్సనల్‌) నెంబర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడుతుందట. అంతేకాదు హైదరాబాద్‌కి వస్తే నాగార్జున ఇంటికే వస్తుందట. 
 

38

దీనికితోడు టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 53ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంది. మరి ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జుననే కారణం అనే ప్రచారం ఉంది. అంతా అదే విషయం మాట్లాడుకుంటున్నారు. తాజాగా దీనిపై ఓపెన్‌ అయ్యారు నాగార్జున. టబుతో ఉన్న తమ రిలేషన్‌ ఏంటో బట్టబయలు చేశాడు. ఈ మేరకు పలు షాకింగ్‌ విషయాలను పంచుకున్నాడు నాగ్‌. టబుతో పెళ్లి వరకు వెళ్లారనే వార్తలపై కూడా నాగ్‌ రియాక్ట్ అయ్యాడు. 
 

48

నాగార్జున మాట్లాడుతూ, టబు హైదరాబాద్‌ వస్తే మా ఇంటికే వస్తుంది. అందుకే ఇలాంటి వార్తలు వచ్చాయి. టబు కోసం మా ఇంటి ముందే అమల ఓ ఇళ్లు కట్టించి పెట్టిందట. వాళ్లిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అట.  ఆమెది హైదరాబాద్‌ అని, సినిమాల్లోకి రాకముందే టబు తనకు బాగా తెలుసు అని చెప్పాడు. అప్పట్నుంచి తాము స్నేహితులమని తెలిపారు. ఇష్టమైన నటి ఆమెనే అని తెలిపారు నాగ్‌. హైదరాబాద్‌ వస్తే తన ఇంట్లో తప్పితే ఎక్కడా ఉండదని, అమ్మానాన్నలతో రెండు మూడుసార్లు భోజనం చేస్తే గానీ వెళ్లిపోదని చెప్పారు నాగార్జున. 
 

58

టబు పెళ్లి చేసుకోకపోవడానికి తనే కారణమనే కామెంట్లపై నాగార్జున స్పందిస్తూ, అలా అనిపించడంలో తప్పులేదు, ఆమె అలా మా ఫ్యామిలీతో కలిసిపోతుందన్నారు. అయితే టబ్‌ మ్యారేజ్‌ చేసుకోకపోవడానికి కారణాలు చెబుతూ తనకు పెళ్లి సెట్‌ కాదని, తాను చాలా ఎమోషనల్‌ అని, హైలీ ఎమోషన్స్ అలా వెళ్లిపోతుంటాయని, ఆమెకి తాను సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నానని తెలిపాడు.

68

తనకు ప్రైవేట్‌ ఫోన్‌ ఉందని, అర్థరాత్రి రెండు గంటలకు టబు నుంచి ఫోన్‌ వస్తుందట. ఫోన్‌ చేసి ఏడుస్తుందట. ఎవరు ఏ బాయ్‌ ఫ్రెండ్‌తో ఏ సమస్య వచ్చిందని అడుగుతాడట. తాను ఏదో ఒకటి చెప్పి సర్దిచెబుతానని, రా ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండిపో అని చెబుతానని, తమ బంధం బయట మాట్లాడుకునేంతటి చెత్తది కాదు అని చెప్పుకొచ్చాడు నాగార్జున. టబుకి ఏ సమస్య వచ్చినా తనకే ఫోన్‌ అవుతుందని చెప్పాడు. 
 

78

ఈ క్రమంలో తమది బెస్ట్ ఫ్రెండ్‌ రిలేషన్‌ అని, బయట ప్రచారం జరిగే రిలేషన్‌ కాదని చెప్పాడు. తను తమ ఫ్యామిలీలోని వ్యక్తి అని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో ఈ విషయాలను బయటపెట్టాడు నాగార్జున. అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితం చేసిన ఇంటర్వ్యూ. తాజాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌ అవుతుంది. మొత్తంగా తమ మధ్య ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి విషయంలో ఉన్న రూమర్‌కి కూడా చెక్‌ పెట్టాడు నాగ్‌. మరి ఇప్పటికైనా ఈ రూమర్లు ఆగుతాయా? ఎప్పటిలాగే కొనసాగుతాయా అనేది చూడాలి. 
 

88

నాగార్జున చాలా రోజుల తర్వాత హిట్‌ కొట్టాడు. ఈ సంక్రాంతికి ఆయన `నా సామిరంగ` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు మరో సంక్రాంతి పండగలాంటి సినిమాతో రాబోతున్నాడు. కొత్త సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. శేఖర్‌ కమ్ముల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories