తరుణ్‌ రాజ్‌తో ఆ సంబంధం లేదు.. నేను డ్రగ్‌ తీసుకోలేదు.. అనుశ్రీ స్పష్టం

First Published | Sep 27, 2020, 7:56 AM IST

కన్నడ డ్రగ్‌ కేసులో టీవీ యాంకర్‌ అనుశ్రీని శనివారం కర్నాటక పోలీసులు విచారించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆమె విచారణ ప్రారంభం కాగా, దాదాపు మూడున్నర గంటల పాటు ఆమెని విచారించినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. 
 

బాలీవుడ్‌లోనే కాడు, కన్నడనాట డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంజనా గల్రానిని అరెస్ట్ చేశారు. ఇటీవల అనుశ్రీ పేరు కూడావినిపించడంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కిశోర్‌ అమన్‌ శెట్టిని అనుశ్రీ కలిసిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కొరియోగ్రాఫర్‌ తరుణ్‌ రాజ్‌ సైతం ఇందులో ఇన్‌వాల్వ్అయినట్టు ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు.

కిశోర్‌ అమన్‌ శెట్టితో, తరుణ్‌ రాజ్‌తో ఉన్న సంబంధాలపై, అలాగే డ్రగ్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నావనే దానిపై పోలీసులు అనుశ్రీని విచారించారు. తరుణ్‌ రాజ్‌ తనకు12ఏళ్ళుగా తెలుసని, కాకపోతే తాను డ్రగ్స్ విషయంలో వారిని కలవలేదని, తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని అనుశ్రీ చెప్పారు.
విచారణ అనంతరం అనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తులో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. పోలీసులు మళ్ళీ పిలిస్తే విచారణకు హాజరవుతాననిచెప్పారు. అయితే మళ్ళీ ప్రశ్నించాల్సి ఉంటుందనే విషయాన్ని పోలీసులు తెలపలేదన్నారు.
`డ్రగ్‌ మాఫియా మన రాష్ట్రాన్ని వెంటాడిన దెయ్యం. ఆ మాఫియాని నిర్మూలించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తుకి మేం సహకరిస్తాము` అనిఆమె చెప్పారు. తరుణ్‌ రాజ్‌ చెప్పిన వివరాల మేరకు అనుశ్రీని కర్నాటక పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!