ఈ ఆదివారం అందిన అప్డేట్స్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. స్టార్ నటుడు మోహన్ లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం రూపుదిద్దుకోనుంది. ‘వృషభ’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ నిన్న గ్రాండ్ గా ప్రారంభమైందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతోంది. 2024లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్‌లలో ఈ లార్జర్ దెన్ లైఫ్ గా విడుదల కాబోతోంది. చిత్రంలో రాగిణి ద్వివేది, శ్రీకాంత్, రోషన్, శరణ్య కపూర్, జరా ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.