దుబాయ్ లో రచ్చ చేస్తున్న రకుల్.. బికినీలో షాకిచ్చిన ఢిల్లీ భామ.. వైరల్ పిక్స్

First Published | Jul 23, 2023, 7:28 PM IST

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  ప్రస్తుతం దుబాయ్ లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. బికినీలో దర్శనమిచ్చి మంటలు రేపింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, నటనతోనూ తెలుగు ఆడియెన్స్ ను బాగా దగ్గరైంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది. 
 

మళ్లీ తెలుగులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అంత వరకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈ ముద్దుగుమ్మ టచ్ లోనే ఉంటోంది. తన మూమెంట్ ను పోస్టుల ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా తన వెకేషన్ పిక్స్ ను పంచుకుంది. 
 


రకుల్ ప్రస్తుతం ఫ్యామిలీతో దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దర్శనమిచ్చింది. ఏకంగా బికినీలో రచ్చ చేస్తూ కనిపించింది. తాజాగా ఢిల్లీ భామ పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకుల్ గ్లామర్ మెరుపులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఆకట్టుకుంది. మరోవైపు చైర్ పై కూర్చొని థైస్ షోతో మతులు పోగొట్టింది. అలాగే తన బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం రకుల్ చేతిలో రెండు సినిమాలే ఉండటంతో ఈ సమయాన్ని ఇలా వెకేషన్లకు ఉపయోగించుకుంటోంది. 
 

మరోవైపు ముంబైలోనూ ఆయా సినీ ఫంక్షన్లు, ఫ్యాషన్ ఈవెంట్లకు హాజరవుతూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అందరి చూపు తనపైనే పడేలా చేస్తోంది. గ్లామర్ మెరుపులతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ కట్టిపడేస్తోంది. మొత్తానికి ఎప్పుడూ నెట్టింట సందడి చేస్తోంది. 

ప్రస్తుతం  ఈ స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళ స్టార్ శివ కార్తీకేయ సరసన ‘ఆయలాన్’లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి. కోలీవుడ్ లో సందడి చేస్తున్న రకుల్ ఇక తెలుగులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!