‘బ్రహ్మస్త్ర’ కలెక్షన్లపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. కరణ్ జోహార్ పైనా ఘాటు విమర్శలు.!

Published : Sep 13, 2022, 03:54 PM IST

స్టార్ హీరోయిన్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా ‘బ్రహ్మస్త్ర’ చిత్ర  కలెక్షన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఏవిధంగా హిట్టో చెప్పాలంటూ నిర్మాత కరణ్ జోహార్ పైనా విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

PREV
17
‘బ్రహ్మస్త్ర’ కలెక్షన్లపై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. కరణ్ జోహార్ పైనా ఘాటు విమర్శలు.!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై తరుచూ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ముక్కుసూటిగా ప్రశ్నిస్తుంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra) కలెక్షన్స్ పై  షాకింగ్ కామెంట్స్ చేసింది.
 

27

రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) - అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, అపూర్ మెహతా రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో  నిర్మించారు. భారీ అంచనాలాతో సెప్టెంబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు క్రియేట్ చేసినంత హైప్ థియేటర్లలోకి వచ్చాక లేదు. ఆడియెన్స్ నుంచి కూడా మిశ్రమ స్పందనే లభించింది.
 

37

మరోవైపు చిత్ర  విమర్శకులు సైతం సానుకూలమైన రివ్యూలు ఇవ్వలేదు. కానీ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) మాత్రం ‘బ్రహ్మస్త్ర’ మాత్రం బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. రెండు రోజుల్లోనే రూ.160 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రకటించారు. దీంతో సర్వ్రతా చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రొడ్యూసర్ కంగనా రనౌత్ కూడా ‘బ్రహ్మస్త్ర’ కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
 

47

ఇన్ స్టా స్టోరీలో స్పందిస్తూ.. 'కరణ్ జోహార్ ను నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఎందుకు 'బ్రహ్మాస్త్ర' నెట్ కలెక్షన్స్ ను చెప్పకుండా.. గ్రాస్ కలెక్షన్స్ ను  ప్రకటిస్తున్నారు?.  రూ.60 కోట్లు అని ప్రకటించిన నెట్ కలెక్షన్స్ నమ్మకంగా లేదు. అదే నమ్మినా ఆ కలెక్షన్స్ కే రూ.650 కోట్ల సినిమా ఎలా హిట్ అవుతుందో కరణ్ జోహార్ గారు వివరించాలి’ అని పేర్కొంది.
 

57

అలాగే..  బాలీవుడ్ లో సినిమా మాఫియాకు, తమలాంటి మనుషులకు  వేర్వేరు చట్టాలున్నాయని అభిప్రాయపడింది. అందుకే మీలాంటి వారికి వేర్వేరు లెక్కలు ఉంటాయా? కాస్తా వివరించాలని సెటైరికల్ పోస్ట్ పెట్టింది. కంగనా 'బ్రహ్మాస్త్ర' రిలీజ్ రోజే డిజాస్టర్ అని తేల్చి చెప్పింది. డైరెక్టర్ అయాన్ రూ.600 కోట్లు బూడిద చేశారని విమర్శించింది. అదేవిధంగా ‘బ్రహ్మస్త్ర’కు క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ ను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. 
 

67

మరో పోస్ట్ లో.. అయాన్ ముఖర్జీని మేధావి అనే వారందర్నీ జైలుకు పంపించాలని, 'బ్రహ్మాస్త్ర' కోసం అతనికి 12 ఏళ్లు పట్టిందని తెలిపింది. 400 రోజులకు పైగా షూట్ చేసిన ఈ చిత్రానికి 14 మంది  సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చారని, ప్రొడక్షన్స్ ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశారని మండిపడింది. 'బాహుబలి' సక్సెస్ తో 'బ్రహ్మాస్త్ర'ను జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా మార్చారని, మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. 
 

77

సినిమా కథపైన కంటే ఇతరుల సెక్స్ లైఫ్ పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడని కరణ్ జోహర్ ను విమర్శించింది. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్ ను డబ్బుతో కొంటుంటాడని మండిపడింది. తన సినిమాల్లో టాలెంట్ ఉన్న నటీనటులను ఎంపిక చేయడం మానేసి.. దక్షిణాది దృష్టిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడని పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

click me!

Recommended Stories