హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' చిత్రం అపురూప ప్రేమ కావ్యంగా ఘనవిజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పట్టారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ చిత్రంలో హిందీలో కూడా సత్తా చాటుతోంది.