ఇదిలా ఉండగా శ్రీసత్య వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కన్నీటి గాధలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు శ్రీసత్య ఓ ఇంటర్వ్యూలు చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. టీనేజ్ లోనే ఆమె పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది అట. అతడితోనే నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాతే పవన్ రెడ్డి తనని మోసం చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.