ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి విజయవంతం చేసే దర్శకుడు మణిరత్నం. 100 రోజులకు పైగా ఆడిన 'సఖి ' సినిమాలో మొదట నటించాల్సిన హీరో, హీరోయిన్ గురించి ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
26
సఖి సినిమా
తెలుగు సినిమాలో ఎన్నో ప్రేమకథలు వచ్చినా, కొన్ని సినిమాలు మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వాటిలో 2000 సంవత్సరంలో వచ్చిన 'సఖి ' ఒకటి.
36
ఎ.ఆర్.రెహమాన్ సంగీతం:
మణిరత్నం మద్రాస్ టాకీస్ ఈ సినిమాను నిర్మించగా, ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ఆయన సంగీతం ప్రాణంలాంటిది. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా సినిమాకు బలం చేకూర్చాయి.
46
మాధవన్ హీరోగా, షాలినీ హీరోయిన్ గా నటించారు
ఈ సినిమాలో మాధవన్ హీరోగా, షాలినీ హీరోయిన్ గా నటించారు. జయసుధ, సోర్ణమాల్య, వివేక్, వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
56
సఖి విడుదలై 25 ఏళ్ళు
కార్తీక్ పై శక్తికి ఉన్న ప్రేమ, అనురాగం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. శక్తికి యాక్సిడెంట్ అయ్యాక, వాళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారనేది మణిరత్నం చక్కగా చూపించారు. ఈ సినిమా విడుదలై 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, ఈ సినిమాలో మొదట హీరో, హీరోయిన్ గా ఎవరు నటించాలో మణిరత్నం చెప్పారు.
66
షారుఖ్ ఖాన్ - కాజోల్ నటించాల్సింది:
సఖి కథను మొదట షారుఖ్ ఖాన్, కాజోల్ తో తీయాలనుకున్నానని, షారుఖ్ కి కథ బాగా నచ్చినా, క్లైమాక్స్ ఎలా ఉండాలో అప్పుడు నాకు ఖరారు కాలేదు. అందుకే అలైపాయుతే సినిమాను తీయకుండా, షారుఖ్, కాజోల్ తో 'దిల్ సే' సినిమా తీశాను. ఆ తర్వాతే అలైపాయుతే సినిమాను షాలినీ, మాధవన్ తో తీశాను. ఈ చిత్రంలో మాధవన్, షాలిని జంట మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. సినిమా సూపర్ హిట్. ఒక వేళ షారుఖ్, కాజోల్ నటించి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో..