ఈ నేపథ్యంలో కంగన మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను ఉద్దేశిస్తూ కంగన మినీ మహేష్ భట్ అంటూ కామెంట్ చేసింది.
undefined
అయితే ఈ వ్యాఖ్యలపై అనురాగ్ ఆచితూచి స్పందించాడు. `కంగనా ఇలా ఎందుకు మాట్లాడిందో అర్ధం కావటం లేదు. నేను ఓ ఫ్రెండ్‌గా ఆమె సమస్యను పరిష్కరించాలనుకున్నా. కంగనా తనకు సాయం చేసే వారిని కూడా శత్రువుగా భావిస్తోంది. నా వ్యాఖ్యలు ఆమెకు బాధ కలిగించి ఉంటే నేను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను` అంటూ కామెంట్ చేశాడు.
undefined
తాజాగా సీనియర్ నటి నగ్మా కూడా కంగనాను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. `కంగనా దీదీ కూడా నెపోటిజం మీదే ఆధారపడింది. ఎవరి సపోర్ట్ లేకుండా కంగనా బాలీవుడ్‌లో ఈ స్థాయికి వచ్చిందా..? కంగనాను బాలీవుడ్ కు పరిచయం చేసిన ఆదిత్య పంచోలి, హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చిన మహేష్ భట్ లు నెపోటిజం వల్లే అవకాశాలు ఇచ్చారా...?` అంటూ ప్రశ్నించింది నగ్మా. ఈ సందర్భంగా హృతిక్ అవకాశాలు ఇవ్వటం పై నగ్మా మాట్లాడింది.
undefined
అయితే నగ్మా వ్యాఖ్యలపై కంగనా డిజిటల్ టీం ఘాటుగా స్పందించింది. అబద్దాలు చెప్పటం మానేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. `నగ్మా గారు ఆదిత్య పంచోలి కంగనా బాయ్ ఫ్రెండ్ కాదు. ఆయన తొలినాళ్లలో మెంటర్‌గా సాయం చేసిన మాట వాస్తవమే కానీ తరువాత కంగనాను చాలా హింసించాడు. ఆమె మీద చేయి కూడా చేసుకున్నాడు. ఈ విషయాన్ని కంగనా కూడా చాలా సందర్భాల్లో చెప్పింది` అంటూ ట్వీట్ చేశారు.
undefined
కంగనాకు పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌లు చేయటం ఇష్టం లేదని అందుకే ఏ ఏజెన్సీ కంగనాను హైర్ చేసుకోలేదని చెప్పింది. ఆ సమయంలో రంగోలి మేనేజర్‌గా మారి కంగనా కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించిందన్నారు.
undefined
కైట్ సినిమాతో తన పాత్ర తగ్గటంతో క్రిష్ 3లో నటించేందుకు నో చెప్పినా ముందే ఇచ్చిన కమిట్‌మెంట్ కారణంగా ఆ సినిమాలో చేయక తప్పలేదని క్లారిటీ ఇచ్చారు కంగనా డిజిటల్ టీం. హీరోయిన్‌గా కంగనా తొలి చిత్రం గ్యాంగ్ స్టర్ సమయంలో నెపోటిజం లేకపోవచ్చుగాని, ప్రస్తుతం ఇండస్ట్రీలో నెపొటిజం తీవ్ర స్థాయిలో ఉందని కామెంట్ చేశారు.
undefined