ఆయోధ్యః కళ్లకి నల్ల అద్దాలు, పట్టుచీరలో ఆలయాన్ని క్లీన్‌ చేసిన కంగనా రనౌత్‌.. యాగం

First Published | Jan 21, 2024, 6:44 PM IST

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అయోధ్యలో సందడి చేసింది. నల్లటి అద్దాలు, పట్టుచీర కట్టుకుని చీపురుతో ఆలయాన్ని శుభ్రం చేసింది. ఈ సందర్బంగా ప్రత్యేకంగా యాగం నిర్వహించింది.
 

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అయోధ్యలో మెరిసింది. రాముడి ప్రాణ ప్రతిష్ట రేపు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్క రోజు ముందే అక్కడికి చేరుకుంది కంగనా రనౌత్‌. అంతేకాదు రాముడి సేవలో నిమగ్నమైంది. ఓ వైపు ఆలయాన్ని శుభ్రం చేసింది. మరోవైపు ప్రత్యేక పూజలు నిర్వహించింది. 
 

ఇందులో హనుమ గర్హి ఆలయాన్ని కంగనా రనౌత్‌ శుభ్రం చేసింది. చీపురు పట్టుకుని మరీ ఆమె క్లీన్‌ చేయడం విశేషం. అయితే కళ్లకి నల్లటి అద్దాలు ధరించింది, పట్టుచీర కట్టింది. అటు స్టయిల్‌, ఇటు ట్రెడిషన్‌ ని మిక్స్ చేసి మెరిసింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 


అదే సమయంలో దేవుడిపై తన భక్తిని చాటి చెప్పింది. హనుమగర్హి ఆలయాన్ని క్లీన్‌ చేసి అనంతరం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక పూజారుల సమక్షంలో ఆమె యాగం చేసింది. స్వామిజీలు, పూజారుల సమక్షంలో కంగనా రనౌత్‌ యాగం చేసింది. 
 

ఈ సందర్భంగా స్వామిజీల ఆశీస్సులు తీసుకుంది. ఇందులో కంగనా రనౌత్‌.. పట్టుచీర, మెడల బంగారు నగలతో అమ్మోరుని తలపించింది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 
 

ఇక రేపు ఆయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు అంతా అయోధ్యకి చేరుకుంటుంది. సుమారు 2500 మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగు నుంచి చిరంజీవి, ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్‌ వంటి తారలు వెళ్తున్నట్టు సమాచారం. 
 

Latest Videos

click me!