Shraddha Das : శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్ కి కుర్రాళ్ల గోల.. కిర్రాక్ స్టిల్స్ పై కుర్రాళ్ల క్రేజీ కామెంట్స్

First Published | Jan 21, 2024, 5:57 PM IST

హీరోయిన్ శ్రద్ధా దాస్ Shraddha Das సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పుడూ నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. 

టాలీవుడ్ లో శ్రద్ధా దాస్ హీరోయిన్ గా ఆయా చిత్రాలతో మెప్పించింది. హీరోయిన్ గా కంటే ఈ ముద్దుగుమ్మకు సపోర్టింగ్ క్యారెక్టర్లతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఒకరకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. 

‘ఆర్య2’, ‘డార్లింగ్’ వంటి చిత్రాల్లో ఈమె నటన ఇప్పటికీ ఆడియెన్స్ కు గుర్తుండే ఉంటుంది. అటు హీరోయిన్ గానూ ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’, ‘నాగవల్లి’, ‘ముగ్గురు’, ‘మొగుడు’ వంటి చిత్రాలతో అలరించింది. 


ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలను నామమాత్రంగా చేసినా.. టీవీ షోలతో మాత్రం అలరిస్తూ వచ్చింది. ‘ఢీ’ డాన్స్ షోతో తెలుగు టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బుల్లితెరపైనా తన అందంతో ఆకట్టుకుంది. 
 

ఇక శ్రద్ధా దాస్ సినిమాల పరంగా కాస్తా గ్యాప్ తీసుకున్నా.. మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన అభిమానులకు మాత్రం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటోంది. వరుసగా పోస్టులు పెడుతూ అట్రాక్ట్ చేస్తుంది. 

ఇప్పటికే శ్రద్దా దాస్ హాట్ హాట్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో శ్రద్ధా లేటెస్ట్ లుక్స్ తో దర్శనమిస్తోంది. తన అభిమానులతో పాటు నెటిజన్లనూ కట్టిపడేస్తోంది.

తాజాగా శ్రద్దా దాస్ వైట్ లాంగ్ ఫ్రాక్ లాంటి డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ అందాలతో ఆకట్టుకుంది. టాప్ గ్లామర్ మెరుపుతో మైమరిపించింది. స్టన్నింగ్ గా స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. చూపుతిప్పుకోవడం కష్టమనిపించింది.

ఇక శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ... గార్జియస్ అంటూ.. జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటూ.. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

మరికొందరు అభిమానులు మాత్రం ఫొటోలకు ఇంట్రెస్టింగ్ గా కామెంట్ ఇచ్చారు.  ’కొన్ని నెగెటివ్ పరిస్థితులు పాజిటివ్ గా మారిపోతాయి’ అంటూ స్పందించారు. దీంతో ఆమె కెరీర్ లో పాజిటివ్ కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది. శ్రద్ధా కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూనే వస్తోంది. తను నటించిన ‘అర్ధం’, ‘నిరీక్షణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. 

Latest Videos

click me!