Brahmamudi: అప్పుని ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్న పెద్దమ్మ.. తన కూతురు ప్రాణాలతో కావాలంటున్న కనకం!

First Published | Oct 7, 2023, 9:30 AM IST

Brahmamudi : స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. భర్త ప్రవర్తనకి కారణం తెలుసుకొని బాధతో ఇంట్లోంచి వెళ్లిపోయిన భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో  కూతుర్ని భోజనానికి రమ్మని అప్పు దగ్గరికి వస్తుంది కనకం. నాకు ఆకలిగా లేదు నేను రాను మీరు భోజనాలు చేసి వచ్చేయండి నేను వెళ్తాను అంటుంది అప్పు. భోజనానికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగోదు అంటుంది కనకం. అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అప్పు. లోపలికి వచ్చిన కనకాన్ని అప్పు ఏది ఇందాకే ఆకలి అన్నది అంటుంది ధాన్యలక్ష్మి.
 

తలనొప్పిగా ఉందని వెళ్ళిపోయింది అంటుంది కనకం. భోజనానికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోకూడదని తెలియదా అని నిస్టూరంగా మాట్లాడుతుంది అపర్ణ. సరే, సరే వెళ్ళి భోజనం దగ్గర కూర్చోండి నేను వడ్డిస్తాను అంటూ టాపిక్ మార్చేస్తుంది ధాన్యలక్ష్మి. కనకం వెళ్లి భర్త పక్కన కూర్చుంటుంది. కావ్య ని కూడా వెళ్లి భర్త పక్కన కూర్చో మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు అని కావ్య తో చెప్తుంది ధాన్యలక్ష్మి.


వెళ్లి భర్త పక్కన కూర్చుంటుంది కావ్య. తనని చూస్తున్న భర్తతో ఎందుకలా చూస్తున్నారు, నేను మీ పక్కన కూర్చోకూడదా అని అడుగుతుంది కావ్య. కూర్చున్న తర్వాత లేపలేం కదా అంటాడు రాజ్. నేనేం కావాలని  కూర్చోలేదు, చిన్న అత్తయ్య కూర్చోమంటేనే కూర్చున్నాను అంటుంది  కావ్య, కావాలంటే మీరే అడగండి అని గట్టిగా ధాన్యలక్ష్మి పిలవబోతే ఆమె నోరు మూసేస్తాడు రాజ్. ఏం జరిగింది అంటుంది రుద్రాణి. నా స్వీట్ తినేసింది అని అబద్ధం చెప్తాడు రాజ్.

 స్వీట్ కోసం గొడవ పడుతున్నావా, నువ్వు బాగా మారిపోయావు అంటుంది రుద్రాణి. మంచిదే కదా అంటాడు సీతారామయ్య. అందరూ అలా సరదాగా బంతి భోజనం చేస్తుంటే చూసి ఎమోషనల్ అవుతాడు సీతారామయ్య. నీకు సంతోషంగా ఉంటే చెప్పు మేం రోజు ఇలాగే భోజనం చేస్తాం అంటాడు ప్రకాష్. అలా మాట్లాడుకుంటూ సరదాగా భోజనాలు ముగిస్తారు. ఆ తర్వాత కావ్య తన గదిలోకి వెళ్లి లెటర్ చదవాలి అనుకున్న టైం కి అక్కడికి వస్తాడు రాజ్.
 

ఎవరూ లేనప్పుడు సిగ్గు పడిపోతావు, అందరి ముందు ఎందుకలా రెచ్చిపోతావు అంటాడు. అలా ఉంటే ఇప్పుడు ఏమైంది అంటుంది కావ్య. మనం కలిసిపోయాం అనుకుంటారు అంటాడు రాజ్.  ఆ మాటలకి షాకైన కావ్య అంటే మీరు కలవాలనుకోవడం లేదా, మారతానన్నారు కదా ఇదేనా మారటం అంటుంది. చనువిస్తున్నాను కదా అని చంకనెక్కాలని చూడకు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.
 

అప్పుడు కావ్య ఎలాగైనా ఈ లెటర్ చదవాలి అనుకొని వాకిట్లోకి వెళ్లి ఆ లెటర్ చదువుతుంది. భర్త మనసులో మాట తెలుసుకుని కన్నీరు పెట్టుకుంటుంది. బాధతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంటికి వచ్చిన తల్లిని నాకు ఏమైనా వండి పెట్టు అని చెప్తుంది అప్పు. అదేంటి అక్కడ ఆకలి లేదని చెప్పి వచ్చావు కదా అంటుంది కనకం. ఇప్పుడు ఆకలేస్తుంది ఏం వండవా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు.
 

చాలా రోజుల నుంచి దీని ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది అని భర్తకు చెప్పింది కనకం. అలాంటిదేమీ లేదు అది ఆకలికి కేకలు వేస్తుందని నీకు తెలుసు కదా వెళ్లి ఏమైనా వండి పెట్టు అంటాడు కృష్ణమూర్తి. ఈ మాటలు అన్ని విన్న అప్పు పెద్దమ్మ అప్పు దగ్గరికి వెళుతుంది. అప్పటికే కళ్యాణ్ ఆలోచనలతో ఉన్న అప్పుని ఎక్కువగా ఆలోచించకు అంటుంది. ఆ కళ్యాణ్ గాడి గురించేనా అంటుంది అప్పు. ఆ మాట నేను అనలేదు, నువ్వే బయటపడ్డావు.  అయినా నువ్వు నాకు ఏమీ సమాధానం చెప్పక్కర్లేదు.
 

 నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకో చాలు. ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నావు అంటే అక్కడ ఉన్న మీ అక్కల పరిస్థితి ఏంటో ఆలోచించుకో.అలాగే మీ అమ్మ ని కూడా నానా మాటలు అంటారు. అలోచించి నిర్ణయం తీసుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు పెద్దమ్మ. మరోవైపు 11 అయినా భార్య గదిలోకి రాకపోవడంతో కిందికి వస్తాడు రాజ్. అక్కడ పనిచేసుకుంటున్న ధాన్యలక్ష్మితో కళావతి ఏది అని అడుగుతాడు.
 

 తను ఇక్కడ కూడా లేదు, అలిసిపోయి రెస్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను అంటుంది ధాన్యలక్ష్మి.  అప్పుడు ఇంట్లో అంతా వెతుకుతాడు రాజ్. కానీ కావ్య కనిపించదు. తరువాయి భాగంలో  అపర్ణ ఇంటికి వచ్చిన కనకం నా కూతురు కనబడకపోవడం ఏమిటి? మీకు, మీ అబ్బాయికి నచ్చకపోతే తనని ఈ ఇంట్లో ఉంచడం అనవసరం నాకు నా కూతురు ప్రాణాలతో అప్పగించండి అంటూ ఫ్రెస్టేట్ అవుతుంది.

Latest Videos

click me!