డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్‌తో కలిసి చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కమల్ హాసన్ ఓపెన్‌గా వెల్లడించారు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? విశేషాలేంటి?
సౌత్ సినిమాలో ఇద్దరు దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించి చాలా కాలం అవుతోంది. వీరు మళ్లీ ఒకే సినిమాలో కలిసి నటిస్తారా? అనే ప్రశ్న చాలా కాలంగా అభిమానుల్లో ఉంది. వీరిద్దరూ తమ నటన, స్టైల్, కథల ఎంపికతో దశాబ్దాలుగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించినా, చాలా కాలంగా వేర్వేరుగా సినిమాలు చేస్తున్నారు.
24
అభిమానులు ఎదురుచూపులు..
అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ కాంబో ఇప్పుడు నిజం కాబోతోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో ఇద్దరూ స్టైలిష్‌గా కనిపించారు. ముఖ్యంగా రజినీ కారు కీని కమల్ వైపు విసరడం, ఆ తర్వాత 'ఇందులో హీరో ఎవరు?' అనే ప్రశ్న రావడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
34
యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన కథ
ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలగలిపిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంటున్నారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఇప్పటి వరకూ రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా లేదన్న లోటును ఈ చిత్రం తీరుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రోమోలో 'ఇందులో హీరో ఎవరు?' అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా స్టైల్‌గా ముగించడం అభిమానులను ఆకట్టుకుంది.
ఇదే విషయంపై కమల్ హాసన్ రీసెంట్ గా మీడియా సమావేశంలో మాట్లాడారు. రజినీతో సినిమా గురించి అడగ్గా.. 'రజినీతో నేను కలిసి నటించే సినిమా షూటింగ్ ఎన్నికల తర్వాతే మొదలవుతుంది. నాకు ఎన్నికల పనులు ఉన్నాయి' అని స్పష్టం చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం 'అవల్ అప్ప', '16 వయదినిలే' వంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు, ఆ తర్వాత కలిసి నటించకపోవడం అభిమానులకు ఎప్పుడూ ఒక లోటుగానే ఉంది.