కన్న కూతురితో కూడా రొమాన్స్ చేయగలడు... కమల్ హాసన్ అలాంటి నటుడంటూ సుమన్ షాకింగ్ కామెంట్స్ 

Published : Jul 22, 2024, 05:20 PM ISTUpdated : Jul 22, 2024, 06:54 PM IST

విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సుమన్... కమల్ హాసన్ మీద చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కూతురు శృతి హాసన్ తో కూడా ఆయన రొమాన్స్ చేయగలడని సుమన్ చెప్పడం చర్చకు దారి తీసింది...   

PREV
16
కన్న కూతురితో కూడా రొమాన్స్ చేయగలడు... కమల్ హాసన్ అలాంటి నటుడంటూ సుమన్ షాకింగ్ కామెంట్స్ 
Suman Talwar

చిరంజీవి సమకాలీన నటుడు సుమన్. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ ఆయన కంటే కొంచెం ముందు జనరేషన్ హీరోలు. వారితో పాటే సుమన్ కూడా స్టార్ గా ఎదిగాడు. సుమన్ తనకు సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కరాటే తెలిసిన సుమన్ యాక్షన్ హీరోగా పాప్యులర్ అయ్యారు. ఆయన జీవితంలో చోటు చేసుకున్న వివాదాలు కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఓ కేసులో ఇరుక్కున్న సుమన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. 

26
Suman Talwar

సుమన్ ని కొందరు కావాలనే ఇరికించారని. ఆయన ఉన్నతిని, ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని తోటి హీరోలు స్కెచ్ వేసి జైలుకు పంపారనే వాదన ఉంది. ఈ వివాదం మీద సుమన్ పలుమార్లు మాట్లాడారు. సుమన్ అప్పట్లో తమిళ్, తెలుగు పరిశ్రమల్లో మార్కెట్ ఉన్న హీరో. 

 

36

కాగా సుమన్ తరచుగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సామాజిక, పొలిటికల్, మూవీకి సంబంధించిన విషయాల మీద స్పందిస్తారు. తాజా ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ మీద ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా కమల్ హాసన్ కన్న కూతురితో కూడా రొమాన్స్ చేయగలడని చెప్పడం ఆసక్తి రేపింది. 

46

కమల్ హాసన్, రజినీకాంత్ రాకముందు ఎంజీఆర్, శివాజీ గణేశన్ కోలీవుడ్ లో స్టార్స్ అని సుమన్ అన్నారు. ఎంజీఆర్ మాస్ యాక్షన్ హీరో. శివాజీ గణేష్ మంచి నటుడు. వీరి తర్వాత 1978-79లో రజినీకాంత్ విలన్ గా ఎంటర్ అయ్యాడు. కమల్ హాసన్ హీరోగా చేసేవారు. కాలేజ్ స్టూడెంట్స్ వీరిని బాగా ఫాలో అయ్యేవారు. రజినీకాంత్ ఓన్లీ స్టైల్. సిగరెట్ ఫ్లిఫ్స్, స్పీడ్ వాకింగ్ తో ట్రెండ్ సెట్ చేశాడు.

56
Kamal Haasan


కమల్ హాసన్ మాత్రం రొమాంటిక్ హీరో. ఆయన డ్రెస్సింగ్ అప్పుడు యూత్ ఫాలో అయ్యేవారు. కమల్ హాసన్ రొమాన్స్ చేస్తుంటే చాలా సహజంగా ఉండేది. మన కళ్ళముందు చేస్తున్నట్లు ఉండేది. భారతీయుడులో ముసలి మేకప్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ వచ్చాడు. ఆ మేకప్ త్వరగా ఊడిపోతుంది. చెమట పట్టకూడదు. అందుకే రెస్ట్ లేకుండా నటించాల్సి వచ్చేది. పాత్ర కోసం గుండు చేయించుకున్న హీరో కమల్ హాసన్. అలాగే ఒరిజినల్ గడ్డం పెంచాడు. 
 

66


కమల్ హాసన్ డీ గ్లామర్ రోల్స్ చేశాడు. మా లాంటి హీరోలు అలాంటి ధైర్యం చేయలేదు. అజిత్, విక్రమ్ వంటి నటులకు కమల్ హాసన్ ఇన్స్పిరేషన్. కమల్ హాసన్ కి నటన గాడ్ గిఫ్ట్. చెప్పాలంటే... తన కూతురు శృతి హాసన్ తో  రొమాంటిక్ సీన్ చేయమన్నా ఆయన చేస్తారు. అది అందరికీ రాదు. ఐదేళ్ల ప్రాయంలోనే కమల్ హాసన్ గొప్పగా నటించాడు... అని సుమన్ కమల్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు. అనంత టీవీ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ ఈ కామెంట్స్ చేశారు. 
 

click me!

Recommended Stories