
గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు విజయశాంతి సినిమాలు బాగా ఆడేవి. హీరోలకు దీటుగా కలెక్షన్లని రాబట్టేవి. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో అనుష్క వచ్చింది. ఆమె నటించిన సినిమాలు కూడా బాగానే వసూళ్లని రాబడుతున్నాయి. అయితే సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పరంగా అత్యధిక వసూళ్లని రాబట్టిన రికార్డు మాత్రం కీర్తిసురేష్, అనుష్క పేరుతోనే ఉంది. కీర్తిసురేష్ `మహానటి`తో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే `అరుంధతి`, `భాగమతి`, `రుద్రమదేవి` చిత్రాలతోనూ అనుష్క కూడా టాప్‌లో ఉన్నారు. సమంత కూడా ప్రయత్నించింది. కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు కీర్తిసురేష్, అనుష్క సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఆమె నటించిన `కొత్తలోక`(లోకః ఛాప్టర్ 1) కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. నెంబర్ వన్‌గా నిలిచింది.
కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ `కొత్త లోక`(లోక చాప్టర్1ఃచంద్ర) ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసింది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం రూ.135కోట్లు రాబట్టింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌తోపాటు నస్లెన్ కె గపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. మహిళా సూపర్ హీరో మూవీగా ఇది తెరకెక్కింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ విడుదల చేశారు. సినిమా బాక్సాఫీసు వద్ద ఇంకా వసూళ్ల జోరు చూపిస్తోంది. మున్ముందు ఇది రెండు వందల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. దీంతో సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్ కథతో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా `కొత్త లోక` నిలిచింది.
అంతకు ముందు కీర్తిసురేష్ పేరిట ఈ రికార్డు ఉండేది. కీర్తిసురేష్ `మహానటి` చిత్రంలో నటించింది. సావిత్రి జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వినీదత్ నిర్మించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం రూ.84కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత వరుసగా అనుష్క సినిమాలున్నాయి. అనుష్క నటించిన `రుద్రమదేవి` రూ.82కోట్లు వసూలు చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రానా కీలక పాత్రలు పోషించారు. కాకతీయ సామ్రాజ్య యువరాణి రుద్రమదేవి కథతో, హిస్టారికల్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. 2015లో ఇది విడుదలైంది.
ఆ తర్వాత అనుష్క నటించిన మరో మూవీ `అరుంధతి` ఉంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. 2009లో హర్రర్ ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ సుమారు రూ.70కోట్లు రాబట్టింది. అప్పట్లో ఇది సంచలన విజయంగా చెప్పొచ్చు. స్టార్ హీరోల మూవీస్‌కి మించిన కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీతోనే అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది.
అనుష్క జాబితాలోనే మరో మూవీ `భాగమతి` ఉంది. 2018లో విడుదలైన ఈ మూవీకి జి అశోక్ దర్శకత్వం వహించారు. హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.67కోట్లు వసూలు చేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఇలా సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్ టాప్ 5 చిత్రాల్లో మూడు అనుష్కవే కావడం విశేషం. ఇప్పుడు ఆమె `ఘాటి`తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. వీకెండ్స్ లో బాగానే వసూలు చేసే అవకాశం ఉంది.