Kalyan Padala Remuneration : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కప్ ను కళ్యాణ్ పడాల సాధించాడు.. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగు పెట్టి.. విజేతగా నిలిచాడు. విన్నర్ గా కళ్యాణ్ ప్రైజ్ మనీ ఎంత, రెమ్యునరేషన్ తో పాటు టైటిల్ విన్నర్ కు లభించే బెనిఫిట్స్ ఏంటి..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా కళ్యాణ్ పడాల విజయం సాధించాడు. టైటిల్ విన్నర్ గా బిగ్ బాస్ కప్పును సామాన్యుడు గెలుపొందాడు. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య.. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి.. తన ఆటతీరుతో, యాటీట్యూడ్ తో అందరికి ఆకట్టుకున్నాడు. అమ్మాయిల పిచ్చొడు అంటూ అపవాదు వచ్చినా.. తనను తాను నిరూపించుకుని.. తానేంటో చూపించాడు. బిగ్ బాస్ హౌస్ తో పాటు బయట ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కళ్యాణ్ విజేతగా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. అయితే కళ్యాణ్ కు తనూజ గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో తనూజ విన్నర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కళ్యాణ్ పడాల అభమానులు మాత్రం కళ్యాణ్ కప్పు గెలవడంపై కాన్ఫిడెట్ గా ఉన్నారు. ఈక్రమంలో విన్నర్ గా పవన్ కళ్యాణ్ పడాలకు అందే బెనిఫిట్స్, రెమ్యునరేషన్ సంగతి ఏంటి?
25
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు దక్కే బెనిఫిట్స్ ఏంటి?
సాధారణంగా బిగ్ బాస్ తెలుగు విన్నర్ కు ప్రైజ్ మనీతో పాటు అన్నిరోజులు హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్, స్పాన్స్ ర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దాంట్లో టాక్స్ లు కట్ అవుతాయని సమాచారం. ఈసారి కూడా బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు , విన్నర్ కళ్యాణ్ కు ఒక కారు కూడా దక్కబోతోంది. అయితే అంతకంటే ముందు డీమాన్ పవన్ 15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేశాడు. ఆ 15 లక్షల మనీ.. విన్నర్ ప్రైజ్ లోంచి కట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో విన్నర్ ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గిపోయింది.
35
కళ్యాణ్ పడాల రెమ్యునరేషన్, స్పెషల్ గిఫ్ట్
కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు వారానికి 2 లక్షల వరకూ రెమ్యునరేషన్ ను అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన్న 15 వారాలకు కళ్యాణ్ 30 లక్షల పారితోషికం లభించబోతోంది. ప్రైజ్ మనీ 35 లక్షలు, రెమ్యునరేషన్ 30 లక్షలు కలిపి 65 లక్షల వరకూ కళ్యాణ్ పడాల అందుకోబోతున్నట్టు సమాచారం. అయితే డీమాన్ పవన్ తీసుకెళ్లిన 15 లక్షలు లెక్కలోకి తీసుకోకపోతే మాత్రం.. పవన్ కళ్యాణ్ పడాలకు 80 లక్షల పైనే అందుతాయి. వాటితో పాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు ఒక కారు బహుమతిగా ప్రకటించారు. వీటితో పాటు స్పాన్సర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా కళ్యాణ్ పడాలకు దక్కబోతున్నట్టు సమాచారం. అంతే కాదు మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ లో అవకాశం ఇస్తూ.. స్పెషల్ బాండ్ కూడా రాయబోతున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాల.. కష్టపడి ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరాడు. మూడేళ్లుగా సరిహద్దుల్లో దేశ సేవ చేస్తున్నాడు. కామనర్ గా బిగ్ బాస్ లో అడుగు పెట్టి.. సెలబ్రిటీలకు చెమటలు పట్టించాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కూడా దడదడలాడించి.. ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ సత్తా చాటాడు. తనదైన గేమ్ తో, యాటీట్యూడ్ తో ఆకట్టుకున్న కళ్యాణ్ పడాల దృష్టిని ఆకర్శించాడు.సామన్యుల కోటాలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా కప్పును సాధించాడు.
55
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సూపర్ సక్సెస్..
తెలగు బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. కొన్ని సీజన్లు బోర్ కొట్టించినా.. కొన్ని సీజన్లు మాత్రం బాగా ఎంటర్టైన్ చేశాయి. గత మూడు సీజన్లు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. మంచి టీఆర్పీలను సాధించింది. సెప్టెంబర్ 10 న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విజయవంతంగా పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కు చేరుకుంది. ఈ సీజన్ లో అంత పెద్ద స్టార్ సెలబ్రిటీలు లేకపోయినా.. సామాన్యులే సత్తా చాటి.. సీజన్ కు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. సామాన్యుల కోటాలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ పడాల టైటిల్ ను గెలిచాడు.