కారణం ఏంటో తెలియదు కాని.. తను ఈ అలవాటు మర్చుకోలేకపోతున్నాడట. ఇంకో విషయం ఏంటంటే.. ప్రభాస్ కు బద్దకం చాలా ఎక్కువ.. ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. అంతే కాదు ప్రభాస్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదే అంట.. ఈ విషయాన్ని స్టార్ డైనరెక్టర్ రాజమౌళి ఓ సందర్భంలో అన్నారు. ప్రభాస్ చాలా బద్ధకస్తుడు, పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకం. ఒక అమ్మాయిని వెతికి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఇదంతా ప్రభాస్‌కి టూ మచ్ వర్క్ అనుకుంటాడు అని అన్నారు జక్కన్న.