`కల్కి 2898 ఏడీ` నిర్మాతలకు తెలంగాణ ఆడియెన్స్ అవసరం లేదా? మరీ ఇంత చిన్నచూపా?

First Published | Sep 3, 2024, 12:58 PM IST

`కల్కి 2898 ఏడీ` సినిమాతో వెయ్యి కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారు `వైజయంతి` నిర్మాతలు. కానీ నైజాం ఆడియెన్స్ విషయంలో చిన్న చూపు చూపించడం చర్చనీయాంశమైంది. 
 

Rains in Andhra Pradesh and Telangana

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అవస్థలు పడుతున్నారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి.భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోతున్నాయి. భారీ వరదల కారణంగా రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది.

దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో భారీ వరద నీళ్ల ఇళ్లల్లోకి చేరి జనం ఇబ్బందలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు స్పందించి తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. మొదట వైజయంతి మూవీస్‌ స్పందించి విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి జమచేయబోతున్నట్టు తెలిపింది.

మొదటగా స్పందించినందుకు వైజయంతి నిర్మాతలను అభినందించాల్సిందే. కానీ కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే విరాళం ప్రకటించి తెలంగాణని వదిలేయడం ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. 
 


భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. నష్టం రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ వైజయంతి మూవీస్‌ వారికి తెలంగాణతో పనిలేదా? ఇక్కడ ప్రజలు వాళ్లకి అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

నైజాం(తెలంగాణ పరిధి) ఆడియెన్స్ మీకు అవసరం లేదా? అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ అంటే ఇంత చిన్నచూపా? అని అడుగుతున్నారు. 

వైజయంతి మూవీస్‌ నుంచి ఇటీవలే ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా వచ్చింది. పెద్ద విజయం సాధించింది. ఇది తెలంగాణ(నైజాం)లో భారీ వసూళ్లని రాబట్టింది. 80కోట్ల షేర్‌ సాధించింది. అంటే 150కోట్లకుపైగా కలెక్షన్లని అందించింది. ఇంతటి భారీ మొత్తంగా వైజయంతికి ఇచ్చింది నైజాం. కానీ సాయం చేయడంలో ఆ నిర్మాతలు తెలంగాణని పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇది తెలంగాణ ఆడియెన్స్ ని అవమానించడమే అవుతుందని అంటున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఈ లోపు నిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి. ఏపీతో పాటు తెలంగాణకి కూడా ఎంతో కొంత ప్రకటించి ఉంటే బాగుండేది. 
 

ఆ తర్వాత ప్రకటించిన ఎన్టీఆర్‌ చెరో యాభై లక్షలు ప్రకటించారు(మొత్తం కోటి). అలాగే త్రివిక్రమ్‌, నిర్మాతలు ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు), నాగవంశీలు కలిసి ఏపీ, తెలంగాణకి చెరో రూ.25లక్షలు ప్రకటించారు. వీరితోపాటు హీరో విశ్వక్‌ సేన్‌ కూడా చెరో ఐదు లక్షలు విరాళం ప్రకటించారు.
 

Kalki 2898 ADs sequel film update out

ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్‌, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటించిన `కల్కి 2898 ఏడీ` చిత్రం జూన్‌ 27న విడుదలైన విషయం తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని రాబట్టింది. వెయ్యి కోట్లకుపైగా గ్రాస్‌ చేసింది. చాలా చోట్ల మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పార్ట్ 2 పై ఫోకస్‌ పెట్టాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. 

Latest Videos

click me!