శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు? ఎట్టకేలకు నోరు విప్పిన నందమూరి హీరో, కారణం ఏమిటంటే?

First Published | Sep 3, 2024, 12:57 PM IST


బాలకృష్ణ-శ్రీదేవి కాంబోలో ఒక్క చిత్రం రాలేదు. బాలయ్య ఆమెతో జతకట్టకపోవడం వెనుక ఓ కారణం ఉందనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు బాలకృష్ణ ఓపెన్ అయ్యాడు. 

శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది. కెరీర్ బిగినింగ్ లో సౌత్ ఇండియాను ఏలిన శ్రీదేవి... అనంతరం బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా జెండా పాతింది. ఇండియా వైడ్ శ్రీదేవికి అభిమానులు ఉన్నారు. 80-90లలో శ్రీదేవి వెండితెర పై శ్రీదేవి చెరగని ముద్ర వేసింది. ఇక తెలుగులో శ్రీదేవి రెండు తరాల హీరోలతో నటించింది. 

bollywood actress sridevi

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో శ్రీదేవి జతకట్టింది. అలాగే ఈ జెనరేషన్ తర్వాత హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో సైతం ఆమె జతకట్టారు. హీరో చిరంజీవికి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ మూవీ అనేక రికార్డ్స్ బ్రేక్ చేసింది. 


Balakrishna

అయితే బాలకృష్ణతో శ్రీదేవి ఒక్క చిత్రం కూడా చేయలేదు. దీనికి ఓ కారణం ఉందనే ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ తో శ్రీదేవి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో జతకట్టింది. సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవిలది హిట్ కాంబినేషన్. శ్రీదేవి బాల్యంలో ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించింది. హీరోయిన్ అయ్యాక ఆయనతో జతకట్టింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ తన కొడుకు బాలయ్యకు ఓ సూచన చేశాడట. శ్రీదేవి కి జంటగా నటించవద్దని ఎన్టీఆర్ బాలయ్యను ఆదేశించాడట. 

sridevi

ఈ మేరకు ఓ వాదన పుకారులో ఉంది. అయితే ఈ వాదన నిజం కాదని తెలుస్తుంది. బాలకృష్ణ నేరుగా ఈ విషయం పై స్పందించారు. బాలయ్య పరిశ్రమకు వచ్చి 50 ఏళ్ళు పూర్తి అయ్యాయి. దాంతో టాలీవుడ్ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించింది. చిరంజీవి, వెంకటేష్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 

Actor Balakrishna

ఈ సందర్భంగా బాలకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. శ్రీదేవితో నటించకపోవడం పై మాట్లాడుతూ... శ్రీదేవి గొప్ప నటి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఆమె నిజంగా దేవకన్యలా ఉంటుంది. అలాంటి హీరోయిన్ తో మూవీ అంటే.. ఆమె స్థాయికి తగ్గ కథ కావాలి. లేదంటే ఆమె స్థాయి తగ్గించినట్లు అవుతుంది. నాకు అంతటి గొప్ప కథ దొరకకపోవడం వలెనే మూవీ చేయలేదని, అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .. 

Balakrishna Movies

ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ గత మూడు చిత్రాలు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. వరుస విజయాలతో బాలకృష్ణ జోరు మీదున్నారు.. 

Latest Videos

click me!