మతిపోగొడుతున్న `కల్కి 2898 ఏడీ` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు.. రిలీజ్‌కి ముందే బడ్జెట్‌కి డబుల్‌..?

Published : Mar 28, 2024, 06:35 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి 2898 ఏడీ` మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీగా జరుగుతుందట. ఆ లెక్కలు బయటకు వచ్చాయి. ఆ లెక్కలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉండటం విశేషం.   

PREV
17
మతిపోగొడుతున్న `కల్కి 2898 ఏడీ` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు.. రిలీజ్‌కి ముందే బడ్జెట్‌కి డబుల్‌..?

ప్రభాస్‌ `సలార్‌`తో దుమ్ములేపాడు. ఇప్పుడు `కల్కి2898ఏడీ`తో సునామీ సృష్టించేందుకు వస్తున్నాడు. ఈ మూవీ చివరి దశకు చేరుకుంది. మేలో రిలీజ్‌ కావాల్సింది. కానీ వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్‌ చర్చల్లో ఉంది. కొన్ని చోట్ల ఓకే అయ్యిందని, మరికొన్ని చోట్లు చర్చల దశలో ఉందని తెలుస్తుంది. 

27

తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిజినెస్‌ లెక్కలు షాకిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తోన్న స్పందన, నిర్మాత డిమాండ్‌ ఆశ్చర్యపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌గా ఒక్కో ఏరియాలో ఎంత పలుకుతుందో తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో మరే మూవీకి కానీ బిజినెస్‌ `కల్కి2898ఏడీ`కి అవుతుందట. ఆ లెక్కలు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. 

37

`కల్కి` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి సుమారు రెండు వందల కోట్ల బిజినెస్‌ జరుగుతుందట. థియేట్రికల్‌ రైట్‌ తెలుగు స్టేట్స్, సౌత్‌ కలుపుకుని రెండు వందల కోట్లు దాటుతుందని తెలుస్తుంది. ఇక నార్త్ లో దుమ్మురేపుతుంది. హిందీ రైట్స్ మాత్రం షాకిస్తున్నాయి. అక్కడ ఈ మూవీకి 175కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట నిర్మాత అశ్వినీదత్‌. ప్రస్తుతం ఆ మేరకు చర్చలు ముగింపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తుంది. 
 

47

మరోవైపు ఓవర్సీస్‌ రైట్స్ 90కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లు అడిగితే, 130కోట్ల వరకు నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారట. ఆల్మోస్ట్ 120 వరకు ఈ మూవీ ఫైనల్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలా థియేట్రికల్‌ రైట్స్ అన్ని కలుపుకుని 450-500కోట్ల వరకు బిజినెస్‌ జరిగే అవకాశాలున్నాయి. 

57

ఇక నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ కూడా మైండ్‌ బ్లో చేస్తున్నాయి. `కల్కి` ఓటీటీ రైట్స్ 350 నుంచి 375కోట్ల వరకు పలుకుతుందట. శాటిలైట్‌, ఆడియో రైట్స్ రూపంలో మరో 125 వరకు వస్తుందని తెలుస్తుంది. ట్రేడ్‌ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ మూవీకి థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలుపుకుని 900-1000 కోట్ల వరకు నిర్మాతకి వస్తుందట. 

67

`కల్కి` బడ్జెట్‌ ఐదు వందల కోట్లు. ఈ లెక్కన బడ్జెట్‌కి డబుల్‌ ప్రాఫిట్‌ రాబోతుందని చెప్పొచ్చు. ఇదే నిజమైతే ఇండియన్‌ బిగ్గెస్ట్ మూవీగా మారబోతుంది. సరికొత్త రికార్డులు సృష్టించబోతుందని చెప్పొచ్చు. బయ్యరు సేఫ్‌ కావాలంటే మినిమమ్‌ ఈ సినిమా 1200కోట్లు వసూలు చేయాలి. లేదంటే నష్టాలు తప్పవు. ఇక నిర్మాతలు ఫుల్‌ హ్యాపీ. 
 

77

`కల్కి`ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అది వచ్చే ఏడాది ఉండే ఛాన్స్ ఉంది. ప్రభాస్‌ భైరవ పాత్రలో కనిపిస్తారు. కమల్‌ హాసన్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా మంది స్టార్స్ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఈ మూవీని మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ సీజీ వర్క్ కారణంగా, అలాగే ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నారు. జూన్‌, జులైలో ప్లాన్‌ చేస్తున్నారట. లేదంటే అక్టోబర్‌, డిసెంబర్‌కి వెళ్లే అవకాశం ఉందట. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories