నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్‌ది గెస్ట్ రోల్ అని తెలుస్తుంది. వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, వర్మ వంటి వారు కూడా కనిపిస్తారట. వైజయంతి మూవీస్ దీన్ని సుమారు 500కోట్లతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.