Kajol Kiss Scene: నటి కాజోల్ ఈ మధ్య తెగ వార్తల్లో ఉంటున్నారు. తన కెరీర్ మొత్తంలో 'నో కిస్సింగ్' పాలసీని కఠినంగా పాటించిన ఆమె, ఇప్పుడు ఆ రూల్‌ను బ్రేక్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్‌లో మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా ఉన్న కాజోల్, తన కెరీర్‌లో ఎప్పుడూ 'నో కిస్సింగ్' పాలసీని ఫాలో అయ్యారు. 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై' లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించినా, ఆమె ఈ రూల్‌ను దాటలేదు. కానీ తన ఓటీటీ డెబ్యూ సిరీస్ 'ది ట్రయల్: ప్యార్, కానూన్, ధోఖా' కోసం ఆ నియమాన్ని పక్కన పెట్టారు.
26
నో కిస్సింగ్ రూల్ బ్రేక్ పై కాజోల్ స్పందన
ఇన్ని రోజులు ఈ విషయంపై మౌనంగా ఉన్న కాజోల్, మొదటిసారిగా లిల్లీ సింగ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆ కిస్సింగ్ సీన్ చేసేటప్పుడు తాను చాలా ఇబ్బంది పడ్డానని, ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా ఆమె పంచుకున్నారు.
36
కిస్ సీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డాఆ
30 ఏళ్లుగా లిప్-లాక్ సీన్లకు దూరంగా ఉన్న కాజోల్, 'ది ట్రయల్' వెబ్ సిరీస్‌లో సహ నటుడు జిషు సేన్‌గుప్తాతో కలిసి ముద్దు సీన్‌లో నటించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే, ఆ సీన్ చేసేటప్పుడు నేను చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను' అని చెప్పారు.
'కెమెరా ముందు నిల్చునే చివరి నిమిషం వరకు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ అది కేవలం ఒక ముద్దు సీన్ కాదు. ఆ పాత్ర భావోద్వేగ ప్రయాణంలో అది ఒక ముఖ్యమైన భాగం' అని కాజోల్ వివరించారు. కథ డిమాండ్ చేయడం వల్లే ఆ సీన్ చేయాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
56
ప్రొఫేషనల్‌గా భావించి ముద్దు సీన్ చేశా
ఆ సీన్‌లో తన పాత్ర పేరు నోయోనికా అని, ఆ సమయంలో ఆమె ఏం ఆలోచిస్తోంది, తను ఏం కోరుకుంది, ఆమెకు ఏం దొరకలేదు అనే విషయాలు ఆ సీన్‌లో ఉన్నాయని కాజోల్ చెప్పారు. 'ఒకవేళ ఆ సీన్ తీసేస్తే, పాత్రకు పూర్తి న్యాయం జరగదు. అందుకే ఒక ప్రొఫెషనల్ నటిగా ఆ నిర్ణయం తప్పలేదు' అని ఆమె తెలిపారు.
66
లాయర్‌గా కాజోల్
సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన 'ది ట్రయల్' వెబ్ సిరీస్, ప్రముఖ అమెరికన్ సిరీస్ 'ది గుడ్ వైఫ్'కి అధికారిక రీమేక్. భర్త స్కామ్ తర్వాత, నోయోనికా సేన్‌గుప్తా అనే గృహిణి మళ్లీ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెడుతుంది. ఈ పాత్రలో కాజోల్ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం 'ది ట్రయల్' సీజన్ 2 జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.