Sreeleela: పాటలు హిట్టు, సినిమాలు ఫట్టు... శ్రీలీలకు ఏమైంది? బాలీవుడ్‌లో నూ తప్పని బ్యాడ్ లక్

Published : Apr 25, 2026, 06:19 PM IST

వరుస అవకాశాలు వస్తున్నా శ్రీలీల కు అదృష్టం కలిసి రావడం లేదు. ఆమె డ్యాన్స్ చేసిన ఐటమ్ సాంగ్స్ సూపర్ హిట్ అయినా, సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తొలి సినిమాకే బ్రేకులు పడటంతో ఆమె కెరీర్ డైలమాలో పడింది. 

PREV
16
శ్రీలీలను వెంటాడుతున్న బ్యాడ్ లక్

ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన శ్రీలీలను.. బ్యాడ్ లక్ వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పట్లో ఆమెను ఇది వదిలేలా కనిపించడం లేదు. శ్రీలీల డ్యాన్స్ చేసిన పాటలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నా, ఆమె నటించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్‌లోనైనా పరిస్థితి మారుతుంది అనుకుంటే.. అక్కడ కూడా తొలి సినిమాకే పెద్ద షాక్ తగిలింది.

26
ఆలస్యమవుతున్న శ్రీలీల బాలీవుడ్ ప్రాజెక్ట్..

శ్రీలీలకు చాలా తక్కువ టైమ్ లో మంచి పేరు వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక తర్వాత అంతటి స్టార్ అవుతుందని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. రష్మిక లాగే కన్నడలో కెరీర్ మొదలుపెట్టి, టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీలీలకు.. అవకాశాలైతే వర్షంలా కురిశాయి. అంతే కాదు వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్స్ సరసన ఆమె నటించించింది. దీంతో ఈ అమ్మాయి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అనుకున్నారు. కానీ ఎందుకో రష్మికకు ఉన్న అదృష్టం శ్రీలీలకు కలిసి రాలేదు.

36
పాటలు హిట్టు.. సినిమా ఫట్టు..!

శ్రీలీల కెరీర్‌లో ఇదే పెద్ద మైనస్‌గా మారింది. స్క్రీన్‌పై శ్రీలీల ఉంటే చాలా అందంగా, చలాకీగా కనిపిస్తుంది. ఆమె డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యం చేసినట్టు ఉంటుంది. అందుకే ఆమె పాటలు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడతాయి. కానీ సినిమాలు మాత్రం కలిసిరావడంలేదు. ఈమధ్య ఆమె కన్నడలో ఆమె నటించిన 'కిస్' సినిమా పరిస్థితి ఇదే. పాటలు సూపర్ హిట్, కానీ సినిమా పెద్దగా ఆడలేదు.

46
టాలీవుడ్‌లోనూ అదే సీన్

టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీసారి ఇదే రిపీట్ అవుతోంది. శ్రీలీల డ్యాన్స్‌ను అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. 'భగవంత్ కేసరి' పెద్ద హిట్ అయినా, ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య బాబుకే వెళ్లింది.ఇక 'పుష్ప' సినిమాలో 'కిసక్' పాటకు శ్రీలీల డ్యాన్స్ చేసింది.. 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా హిట్ అయినా, ఆ క్రెడిట్ హీరోయిన్ రష్మికకు దక్కింది కానీ, ఈ పాటలో డ్యాన్స్ చేసిన శ్రీలీలకు పెద్దగా పేరు రాలేదు.

56
బాలీవుడ్‌లో పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు హిందీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ముఖ్యంగా కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్న 'ఆషికీ-3'పై భారీ అంచనాలున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సి ఉంది.కానీ తాజా సమాచారం ప్రకారం, 'ఆషికీ-3' షూటింగ్ కేవలం 45 రోజులు మాత్రమే జరిగిందట. సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. కాబట్టి ఈ ఏడాది చివర్లో సినిమా రావడం కష్టమేనని అంటున్నారు. 

66
ఆశలన్నీ ఆ సినిమాపైనే..

ఇక ఈ ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్'తో యావరేజ్ అనిపించుకున్న శ్రీలీల, 'ఆషికీ-3'పైనే ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా ఆలస్యం అవుతుండటంతో, తన బ్యాడ్ లక్‌కు ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని శ్రీలీల ఎదురుచూస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories