బాలయ్య మూవీలో శ్రీలీల రోల్ అదే... పుకార్లకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Published : Jan 29, 2023, 09:43 AM ISTUpdated : Jan 30, 2023, 08:28 AM IST

కాజల్‌ అగర్వాల్‌ రెండేళ్లుగా సినిమాలకు దూరమయ్యింది. ఆమె పెళ్లి, కుమారుడికి జన్మనివ్వడంతో గ్యాప్‌ తీసుకుంది. అయితే చాలా కాలంగా ఆమె రీఎంట్రీకి ప్లాన్ చేస్తుంది. 

PREV
15
బాలయ్య మూవీలో శ్రీలీల రోల్ అదే... పుకార్లకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

కాజల్‌ అగర్వాల్‌(Kajal Aggarwal).. రీఎంట్రీ మూవీ బాలకృష్ణ(Balakrishna)తో చేయబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో, అటు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్బీకే108` (NBK108)చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ని ఎంపిక చేశారని తెలుస్తుంది. మొదట హనీరోజ్‌(Honey Rose) అనుకున్నారట. ఈ బ్యూటీ `వీరసింహారెడ్డి`లో పెద్ద బాలయ్యకి జోడీగా చేసిన విషయం తెలిసిందే. 

25

ఆమెతోపాటు ప్రియాంక జవాల్కర్‌, అలాగే బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా వంటి వారి పేర్లని పరిశీలించినట్టు సమాచారం. కానీ ఫైనల్‌గా కాజల్‌కే మొగ్గుచూపారట దర్శకుడు అనిల్‌ రావిపూడి. అయితే కాజల్‌ ఇప్పటి వరకు బాలకృష్ణతో సినిమా చేయలేదు. కేవలం చిరంజీవితోనే సినిమా చేసింది కాజల్‌. చూడబోతుంటే ఇప్పుడు సీనియర్లని చుట్టేయబోతుందని అనిపిస్తుంది. 
 

35

ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య మూవీలో శ్రీలీల రోల్ ఏమిటనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బాలయ్య వయసుకు తగ్గ పాత్రలు చేస్తుండగా శ్రీలీల ఆయన కూతురిగా కనిపిస్తారనే ప్రచారం మొదలైంది. ఈ వార్తల్లో నిజం లేదని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టత ఇచ్చారు. `ఏషియానెట్‌`కి ఆయన వివరన ఇచ్చారు. శ్రీలీల ఓ కీలక రోల్ చేస్తున్నారని, ఆమె పాత్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందని వెల్లడించారు. దీంతో శ్రీలీల బాలయ్య కూతురిగా చేస్తున్నారన్న పుకార్లకు చెక్ పెట్టినట్టైంది.

45

ఇదిలా ఉంటే సినిమా ప్రధానంగా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. అనిల్‌ రావిపూడి మార్క్ కామెడీతోపాటు మాస్‌ఎలిమెంట్లు, బాలయ్య స్టయిల్‌ యాక్షన్‌ మేళవింపుగా ఉంటుందని సమాచారం. మూడు అదిరిపోయే ఫైట్లు డిజైన్ చేశారట. దీంతోపాటు ఫస్టాఫ్‌ మొత్తం జైల్‌ ఎపిసోడ్‌ ఉంటుందని, బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సాగుతుందట. కాజల్‌ సెకండాఫ్‌లో వచ్చే అవకాశం ఉంది. అంటే బాలయ్యకి ఫ్లాష్ బ్యాక్‌లో జోడీగా మరో హీరోయిన్ ఉంటే, ఆ తర్వాత కాజల్‌ వస్తుందా? అనే సస్పెన్స్ గా ఉంది. మరి ఎలా ఉండబోతుందనేది మున్ముందు తేలనుంది. 
 

55

కాజల్‌ చివరగా `మోసగాళ్లకు మోసగాళ్లు` చిత్రంలో నటించింది. చిరంజీవితో `ఆచార్య`లో నటించినా, చివర్లో ఆమె పాత్రని లేపేశారు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌కి పరిమితమైన కాజల్‌ గతేడాది కుమారుడు నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీకే టైమ్‌ కేటాయిస్తుంది. ముద్దుల చిన్నారితో ఆడుకుంటూ మాతృత్వపు ఆనంద క్షణాలను అనుభవిస్తుంది. మరోవైపు టైమ్‌ దొరికిప్పుడు హాట్‌ ఫోటోషూట్‌లతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ అందాల చందమామ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories