ఇక మాళవిక మోహనన్ మరో స్టార్ హీరోకి గాలెం వేసింది. బాలీవుడ్‌లో ఏ హీరో అంటే ఇష్టమని ఫ్యాన్స్ అడగా, షారూఖ్ ఖాన్ అని తెలిపింది. ఆయన నటించిన `పఠాన్`లోని పాటలు బాగా నచ్చాయని తెలిపింది. అంతేకాదు తమిళ స్టార్ విజయ్‌పై కూడా ప్రశంసలు కురిపించింది. కన్నడ చిత్ర పరిశ్రమ గురించి చెబుతూ, తనకు చాలా ఇష్టమని, గత రెండుమూడేళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమ అద్భుతంగా మారిపోతుందని, చాలా హ్యాపీగా ఉందని, కన్నడలో ఛాన్స్ లు వస్తే నటించేందుకు సిద్ధమే అని పేర్కొంది.