కాజల్‌, శ్రియా, కేథరిన్‌, మాళవిక.. `మై సౌత్ దివా క్యాలెండర్‌` కోసం మెరుపులు

Published : Jan 25, 2025, 10:34 PM IST

కాజల్‌ అగర్వాల్‌, శ్రియా శరణ్‌, కేథరిన్‌ థ్రెసా, మాళవిక శర్మ వంటి స్టార్‌ హీరోయిన్లు మై సౌత్‌ దివా క్యాలెండర్‌ కోసం పోజులిచ్చారు. ఈక్యాలెండర్‌ ని తాజాగా ఆవిష్కరించారు.   

PREV
12
కాజల్‌, శ్రియా, కేథరిన్‌, మాళవిక.. `మై సౌత్ దివా క్యాలెండర్‌` కోసం మెరుపులు

స్టార్‌ హీరోయిన్లు సినిమాల్లో చేసే సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. వీరంతా తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా కూడా గ్లామర్‌ ఫోటోలతో ఆకట్టుకుంటారు. నిత్యం ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా 2025 క్యాలెండర్‌ కోసం హోయలు పోయారు.

గ్లామర్‌ మెరుపులతో అలరించారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్‌ కటోకర్‌ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్‌ కోసం వీరంతా ఫోటో షూట్‌ చేయడం విశేషం. 

కాజల్‌ అగర్వాల్‌, శ్రియా శరణ్‌, కేథరిన్‌ థ్రెసా, మాళవిక శర్మ, తాన్య హోప్‌, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్ తో  ఈ క్యాలెండర్ ను డిజైన్‌ చేశారు. 2025కి చెందిన ఈ క్యాలెండర్‌ని శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ఇందులో క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరై తమ విషెస్ తెలియజేశారు. 
 

22

ఈ సందర్భంగా `మై సౌత్ దివా క్యాలెండర్` ఫౌండర్, ఫోటో గ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ, `మా క్యాలెండర్ ను తొమ్మిది ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12 మంది హీరోయిన్స్ తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.

మా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే  కొత్తవారిని మోడల్స్ గా పరిచయం చేశాం. అలాగే కొంతమంది హీరోయిన్స్ గా మంచి గుర్తింపును అందుకున్నారు.  ఈ ఏడాది మరో ఐదుగురిని  ఇంట్రడ్యూస్ చేస్తున్నాం` అని తెలిపారు. 

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ, `పలాస` మూవీ టైమ్‌లో మనోజ్ నాకు  చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయనతో నాకు ఐదేళ్ల జర్నీ ఉంది. ఇప్పటికీ నా సినిమాల్లో  హీరోయిన్స్ కోసం ఆయన రిఫరెన్స్ తీసుకుంటాను. ఈ సందర్భంగా ‘పలాస’ చిత్రాన్ని మార్చి 6న రీ  రిలీజ్ చేయాలని ప్రకటిస్తున్నాం’ అని చెప్పారు.

భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, `సౌత్ దివా  క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక క్యాలెండర్‌‌లో చాలా కల్చర్స్ ఉండటం మంచి పరిణామం. స్టార్ హీరోయిన్స్‌తో ఉన్న ఈ క్యాలెండర్ కలర్‌‌ఫుల్‌గా ఉంది’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌, దర్శకురాలు సుజనారావు, హీరోయిన్లు రిచా సచ్‌దేవ్‌, మాల్వి మల్హోత్రా, ఐశ్వర్య కృష్ణ, పలక్ అగర్వాల్, కనిక మాన్, అనుశ్రీ, రిచా జోషి, జెస్సీ పాల్గొన్నారు.  

read  more: వెంకటేష్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. సంచలన దర్శకుడు ప్లానింగ్‌?

also read: బాలకృష్ణకి పద్మభూషణ్‌ పురస్కారంపై ఎన్టీఆర్‌ పోస్ట్.. బాబాయ్‌ గురించి అబ్బాయిలు ఏమన్నాడంటే?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories