ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన ను కూడా పద్మ భూషన్ వరించింది. ఆమె కూడా అందరికి సుపరిచితురాలే. హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరించిన శోభన.. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, రజినీకాంత్, మోహన్ లాల్, లాంటి స్టార్స్ తో కలిసి మెరిసింది. హీరోయిన్ గా మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ గా కూడా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న శోభన.
ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు. పెళ్ళి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని డాన్స్ కు అంకితం చేశారు. క్లాసికల్ డాన్స్ షోలు చేస్తూ.. డాన్స్ స్కూల్ నడిపిస్తూ.. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ..గడిపేస్తున్నారు. ఆమె కళా రంగానికి చేసిన సేవకుగాను గౌరవంగా పద్మ అవార్డ్ అదించబోతున్నారు.