ఫస్ట్ టైమ్‌ కుమారుడిని పరిచయం చేసిన కాజల్‌.. `మదర్స్ డే` ఎషనల్‌ నోట్‌..వైరల్‌

Published : May 08, 2022, 12:49 PM ISTUpdated : May 08, 2022, 02:21 PM IST

కాజల్‌ అగర్వాల్‌ మాతృత్వాన్ని ఆస్వాధిస్తుంది.  ప్రతి క్షణం తన కుమారుడితోనే ఉంటూ అ మధురమైన అనుభూతిని పొందుతుంది కాజల్‌. తాజాగా ఆమె మదర్స్ డే సందర్భంగా తన కుమారుడిని ఫోటోని అధికారికంగా పంచుకుంది. 

PREV
17
ఫస్ట్ టైమ్‌ కుమారుడిని పరిచయం చేసిన కాజల్‌.. `మదర్స్ డే` ఎషనల్‌ నోట్‌..వైరల్‌

కాజల్‌(Kajal).. ఫస్ట్ టైమ్‌ తన కొడుకుని అభిమానులకు పరిచయం చేసింది. మగబిడ్డకి (Kajal Son) జన్మనిచ్చిన నెక్ట్స్ డే నుదుటిపై ప్రేమతో ముద్దాడుతున్న ఫోటోని పంచుకున్నా ఆమె తాజాగా తన గుండెలోపై పడుకోబెట్టుకుని ఆ మాతృత్వంలోని లోతైన అనుభూతిని పొందుతుంది. అయితే కుమారుడి ఫేస్‌ కంప్లీట్‌గా కనిపించకుండా జగ్రత్త పడటం విశేషం. ఈ సందర్భంగా మదర్స్ డే (Kajal Mothers Day) శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ మదర్‌ నోట్‌ని షేర్‌ చేసింది కాజల్‌. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది. 

27

తల్లి అయ్యాక తాను పొందుతున్న సంతోషాన్ని పోస్ట్ (Kajal Post) రూపంలో వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పేర్కొంటూ, 'నువ్వు నాకెంత ఇంపార్టెంటో నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నా. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం.. నీ చిట్టి చేతులను తాకిన క్షణం, నీ వెచ్చని స్పర్శ తాకిన క్షణం, నీ అందమైన కళ్లల్లోకి చూసినప్పుడు,  నీతో ఎప్పటికీ ప్రేమలో ఉంటానని తెలుసు. నువ్వు నా మొదటి బిడ్డవు. నా సర్వస్వం` అంటూ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకుంది కాజల్‌. 

37

`రాబోయే రోజుల్లో నాకు సాధ్యమైనంతగా నీకు అన్నీ నేర్పిస్తాను. కానీ ఇప్పటికే నువ్వు నాకు చాలా నేర్పేశావు. తల్లి అంటే ఏంటో... నిస్వార్థంగా ఎలా ఉండాలో నేర్పించావు. నా శరీరం బయట కూడా నా హృదయం మనగలడం సాధ్యమేనని నేర్పించావు. నువ్వు నా సూర్యుడివి, చంద్రుడివి, నా స్టార్స్ అన్నీ నీవే... ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకు` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 
 

47

మరోవైపు ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో తన బిడ్డకి సంబంధించిన మరిన్ని ఫోటోలను షేర్‌ చేసింది. తన సిస్టర్‌ నిశా అగర్వాల్‌ కొడుకు తన కుమారుడిని ఎత్తుకున్న ఫోటోని, తన సిస్టర్‌ ఎత్తుకుని ఆడిస్తున్న పిక్‌, దీంతోపాటు తన పేరెంట్స్  ఆడుకుంటున్న పిక్‌ని షేర్‌ చేసింది. ప్రస్తుతం అన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వారు కాజల్‌కి మదర్స్ డే విషెస్‌ తెలియజేస్తుండటం విశేషం. 
 

57

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్‌ కెరీర్‌ పీక్‌ టైమ్‌లోనే ప్రియుడు గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. 2020 అక్టోబర్‌లో వీరి వివాహం జరిగింది. అనంతరం తాను కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసింది కాజల్‌. ఈ ఏడాది జనవరిలో తాను ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని తెలియజేశారు. మొదట గౌతమ్‌ కిచ్లు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత కాజల్‌ పలు ఎమోషన్స్ నోట్‌లతో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయాన్ని తెలిపారు. 
 

67

ఇక ఏప్రిల్‌ 19న కాజల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. కుమారుడు పుట్టిన వెంటనే పేరు కూడా పెట్టేశారు. `నీల్‌ కిచ్లు` అంటూ నామకరణం చేస్తూ ఓ పోస్ట్ ని షేర్‌ చేశారు. ఇన్ని రోజుల తర్వాత `మదర్స్ డే` సందర్భంగా  ఏకంగా కుమారుడిని పరిచయం చేస్తూ ఓ నోట్‌ని షేర్‌ చేసుకుంది కాజల్‌. ఫస్ట్ టైమ్‌ కుమారుడి ఫోటోని పంచుకోవడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆయా ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 

77

ఇదిలా ఉంటే కాజల్‌ సినిమా కెరీర్‌కి పుల్‌స్టాప్‌ పెట్టినట్టే అంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో కాజల్‌ మాత్రం తన అందం ఏమాత్రం తగ్గలేదని, నిరూపిస్తూ తాజాగా ఫోటో షూట్‌ చేసింది. బెడ్‌పై హోయలు పోతూ హీటెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. అదే సమయంలో తాను మళ్లీ నటించేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుందని అంటున్నారు నెటిజన్లు. మరి కాజల్‌ మళ్లీ నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories